కన్నడ సెన్సేషన్ కెజిఎఫ్ చాప్టర్ 2 సెట్స్ మీద ఉండగానే రికార్డులు మొదలయ్యాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సూపర్ హిట్ అందుకున్న కెజిఎఫ్ సినిమా ఇప్పుడు సీక్వల్ తో మరోసారి రికార్డుల మీద కన్నేసింది. కెజిఎఫ్ చాప్టర్ 2లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ కూడా నటిస్తున్నారని తెలిసిందే. ఈ ఇయర్ దసరాకి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ వల్ల వాయిదా పడ్డది. 

 

ఇక సెట్స్ మీద ఉండగానే సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరుపుతున్నాయి. కెజిఎఫ్ చాప్టర్ 2 శాటిలైట్ రైట్స్ భారీ స్థాయిలో అమ్ముడయ్యాయని తెలుస్తుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మళయాళ భాషల్లో కలిపి కెజిఎఫ్ 2 సినిమా శాటిలైట్ రైట్స్ 120 కోట్లకు సెల్ చేశారట. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ఈ శాటిలైట్ రైట్స్ దక్కించుకుందని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న కెజిఎఫ్ 2 సినిమాలో యష్, శ్రీనిధి శెట్టి కలిసి నటించారు. 

 

కెజిఎఫ్ చాప్టర్ 2 మరింత భారీతనంతో రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. కెజిఎఫ్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. సినిమాలో ప్రశాంత్ నీల్ చాల సర్ ప్రయిజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. తెలుగులో కూడా కెజిఎఫ్ 2 మీద అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు థియేట్రికల్ రైట్స్ కూడా అదిరిపోయే బిజినెస్ జరిగేలా ఉందని టాక్.                   

మరింత సమాచారం తెలుసుకోండి: