బాలీవుడ్ ప్రేక్షకులకు అంటే ఎందుకంత ప్రేమ. సాహో తెలుగులో ఫ్లాప్ అయినా.. హిందీలో హిట్ అయింది. హిందీ ప్రేక్షకులు బాలీవుడ్ స్టార్స్ ను సైతం పక్కన పెట్టేసి ప్రభాస్ సినిమానే చూడాలనుకుంటున్నారు. మన తెలుగు హీరో హిందీ ఆడియన్స్ కు ఎందుకంత నచ్చేశాడో తెలుసా... 

 

బాలీవుడ్ లో ప్రభాస్ సందడి చేస్తోంది. బాహుబలితో ఎంట్రీ ఇచ్చాడు. బాహుబలి2 ఘన విజయంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. రాజమౌళి ఆశీస్సులతో ఇండియన్ హీరో అయిపోయాడనుకున్నారంతా. సాహో రిజల్ట్ చూసిన తర్వాత బాలీవుడ్ లో ప్రభాస్ కు ఉన్న ఫాలోయింగ్ ఏమిటో అర్థమైంది. సాహో తెలుగులో సక్సెస్ అయినా.. హిందీలో 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి పెట్టుబడిని రాబట్టింది. 

 

బాలీవుడ్ లో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ సాహోతో ఆగలేదు. బాహుబలి2తో వచ్చిన ఇమేజ్ కలిసొచ్చి సాహో హిందీ 100కోట్లు రాబట్టిందనుకోవడానికి వీల్లేదు. అదెలా అంటే.. ఇప్పటికే సాహో సినిమాను టీవీల్లో చాలాసార్లు ప్రసారం చేశారు. ఈ ఏడాది 17వ వారంలో టెలికాస్ట్ చేస్తే.. బాలీవుడ్ హీరోలందరి సినిమాల కంటే... సాహోనే ఎక్కువ మంది చూశారు. బుల్లితెరపై సాహోకు 8.33 మిలియన్ ఇంప్రెషన్స్ వచ్చాయని రేటింగ్స్ లో తేలింది. 

 

2020.. 17వ వారంలో ప్రసారం చేసిన హిందీ సినిమాల్లో రెండో ప్లేస్ లో ప్రభాసే ఉన్నాడు. మొదటి ప్లేస్ సాహోది కాగా.. రెండో ప్లేస్ ను బాహుబలి బిగినింగ్ ఆక్రమించింది. కొన్ని వందలసార్లు బాహుబలిని టెలికాస్ట్ చేసినా.. 7.38మిలియన్ ఇంప్రెషన్స్ తో రెండో ప్లేస్ లో ప్రభాస్ మూవీ ఉండటం విశేషం. బాలీవుడ్ లో తనకున్న క్రేజ్ ను ఉపయోగించుకుంటూ.. వరుసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. మొత్తానికి ప్రభాస్ అంటే బాలీవుడ్ జనాలు తెగ ఇష్టపడిపోతున్నారు. బాహుబలి, సాహోతో హిందీ ప్రేక్షకులను తన వైపు తిప్పేసుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: