హీరోయిన్స్ లో తాప్సీకి కాస్త్ డేర్ ఎక్కువ. తన గురించి గాసిప్స్ రాస్తే అస్సలు ఊరుకోదు. చెడామడా క్లాస్ పీకేస్తుంది. డేటింగ్ లో ఉన్నట్టు చెప్పేసి ఆ మధ్య షాక్ ఇచ్చింది. భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ రాకుండా.. లవ్ లైఫ్ ను చాలా బాగా డిజైన్ చేసుకుంటోంది తాప్సీ. సొట్టబుగ్గల సుందరి అసలు ఎవరితో డేటింగ్ లో ఉందో తెలుసా.. 

 

సెలబ్రిటీస్ ఎవరితోనైనా కలిసి తిరిగితే లవ్.. డేటింగ్ అంటూ వార్తలొచ్చేస్తాయి. ప్రేమా.. గీమా లేదు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి.. ఆ తర్వాత  పెళ్లి చేసుకున్న జంటలు చాలా ఉన్నాయి. కానీ.. తాప్సీ స్టైల్ మాత్రం ఇంతకు విరుద్దం. డేటింగ్ లో ఉన్నామంటూ డేర్ గా చెప్పేసింది తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బో ప్రేమలో తాప్సీ ఉందని ప్రచారం సాగింది. దీనికి సాక్ష్యంగా ఫోటోలు కూడా బయటికొచ్చాయి. తన ప్రియుడి సంగతి ఇంట్లో తెలుసుకొని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది తాప్సీ. 

 

తన జీవితంలో ఓ వ్యక్తి ఉన్నాడనీ చెప్పడం తనకెంతో గర్వంగా ఉందంటోంది తాప్సీ. తన వాళ్ల దగ్గర ఆ విషయాన్ని దాచలేదనీ.. అతను ఇంట్లో అందరికీ నచ్చాలి కదా.. తల్లిదండ్రులు అంగీకారం లేకపోతే.. ఏ ప్రేమా జీవితాంతం నిలవదని చెప్పింది. తాప్సీ చూసేందుకు చిన్నపిల్లలా కనిపిస్తుంది కానీ.. ముందుచూపు.. మెచ్యూరిటీ లెవల్స్ ఎక్కువే. 

 

తాప్సీ ప్రేమకు తల్లిదండ్రుల ఆశీస్సులున్నాయి. ఇదే ఇంటర్వ్యూలో తాప్సీ తల్లి నిర్మల్ జీత్ మాట్లాడుతూ.. తనకు తాప్సీపై పూర్తి నమ్మకం ఉందన్నారు. ఎవర్ని ఎంచుకున్నా.. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి తాప్సీ.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతుందా.. ప్రస్తుతం హిందీలో మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కెరీర్ పీక్స్ లో ఉన్న ఈ టైమ్ లో పెళ్లి చేసుకుంటుందా.. లేదంటే.. క్రేజ్ తగ్గేవరకు వెయిట్ చేసి.. అప్పుడు పెళ్లి పిల్లలు అంటుందా.. ప్రేమ విషయంలో ఓ పద్దతి ప్రకారం నడుచుకుంటున్న తాప్సీ.. పెళ్లి విషయంలో ఆమె ప్లాన్స్ ఆమెకు ఉండి ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: