తెలుగు సినిమాలకు ఇపుడు లాక్ డౌన్ చాలా పెద్ద దెబ్బ. అయితే అన్నింటి కంటే కూడా అతి పెద్ద దెబ్బ ఆర్.ఆర్.ఆర్ మూవీకి అంటున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ. ఈ మూవీ రెండేళ్ళుగా తీస్తున్నారు. వచ్చే ఏడాది రిలీజ్ పెట్టుకున్నారు. కరోనా వైరస్ కనుక లేకపోతే, రాకపోతే వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చి సందడి చేసేదే.

 

అయితే ఇపుడు మాత్రం సీన్ మారింది. ఆర్.ఆర్.ఆర్ మూవీ నిర్మాత దానయ్య చెప్పేశారు. సంక్రాంతికి మూవీ రావడం కష్టమని కూడా తేల్చేశారు. ఈ మూవీ వస్తే 2021 సమ్మర్ కేనని కూడా చెప్పేశారు. అయితే ఇపుడు నాలుగవ విడత లాక్ డౌన్ రన్ అవుతోంది. ఇది మరెంత కాలం పొడిగిస్తారో తెలీయదు. రిలాక్సేషన్ ఇచ్చినా కూడా సినిమాలకు షూటింగులకు ఉంటుందో లేదో తెలియదు.

 

ఇక ఈ మూవీ విషయానికి వస్తే విదేశీ నటులు ఉన్నారు, టెక్నీషియన్లు కూడా వారే ఉన్నారు. పాన్ ఇండియా కాబట్టి చాలా కావాలి. అంటే ఓ విధంగా ప్రపంచం అంతా సాధారణ స్థితికి వస్తే తప్ప ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పట్టలెక్కదు. నిర్మాత దానయ్య చెప్పినట్లుగానే ఆలోచిస్తే 2021 సమ్మర్ కి ఈ మూవీ రిలీజ్ కావాలంటే మాత్రం జూలైలో షూటింగ్ మొదలైపోవాలి. ముందే చెప్పుకున్నట్లుగా విదేశీ నటులు రావాలి అంటే లోకమంతా మునుపటిలా ఉండాలి.

 

ఇప్పుడున్న సిట్యువేషన్లో అది జరిగే పనేనా అన్న డౌట్లు అందరికీ వస్తున్నాయి. ఇక ఆర్.ఆర్.ఆర్ మూవీ బిగ్ ప్రాజెక్ట్, కుంభస్థలాన్ని కొట్టేలా తీస్తున్నారు. అందువల్ల ఈ మూవీ విషయంలో ఎటువంటి ఆంక్షలు, టెన్షన్లూ లేకుండా ఉంటేనే పట్టాలెక్కేది. మరి ఇపుడు చూస్తున్న వాతావరణంలో అలాంటిది  జరిగే అవకాశం ఉందా అంటే లేదనే చెప్పాలి.

 

అందువల్ల ఆర్.ఆర్.ఆర్ వచ్చే ఏడాది సమ్మర్ కి కూడా రిలీజ్ అవుతుందా అంటే డౌటేనని ఇపుడు వినిపిస్తున్న మాట. మరి ఆ తరువాత ఎపుడు వస్తుందో. ఓ వైధంగా కరోనా వచ్చి కాటేసిన అతి పెద్ద సినిమాగా ఆర్.ఆర్.ఆర్ ని చెప్పుకోవాలి. లేకపోతే ఈ పాటికి చాలా వర్క్ జరిగేది. ఏది ఏమైనా ఈ కరోనా కష్టాలు తొందరలోనే తొలగిపోవాలని అంతా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: