జులై 11, 2003వ సంవత్సరంలో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన సింహాద్రి సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఎంతలా అంటే తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల నోట సింహాద్రి సినిమా రెండు మూడు సంవత్సరాల వరకు నానిపోయింది. కేవలం 20 సంవత్సరాల వయసులో తన అద్భుతమైన నటనతో, డాన్స్ తో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపి రికార్డుల సునామి తో దూసుకెళ్లడం జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమయింది. ఈ చిత్రంలో తారక్ తన నట విశ్వరూపం చూపించి తన తాత ఎన్టీఆర్ తగ్గ అసలుసిసలైన మనవడిగా నిరూపించుకున్నాడు. 2003 వరకు తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా పాఠశాల అనుభవంతో కొనసాగుతున్న చిరంజీవి కూడా జూనియర్ ఎన్టీఆర్ తర్వాత నే అని తెలుగు ప్రేక్షకులంతా గంటా పదంగా చెప్పుకొచ్చారు. అప్పుడు అతని క్రేజ్ ను కళ్ళారా చూసిన నందమూరి కుటుంబం ఈ ఎన్టీఆర్ మావోడే అనేసి తనకి దగ్గర కావడం మొదలు పెట్టారు. జానకిరామ్, కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ ను చేరదీసి తమ్ముడు తమ్ముడు అని పిలవడం ప్రారంభించారు. 

 


ఐతే సింహాద్రి సినిమా హిట్ అయిన సమయంలో సింహాద్రి సినిమాకి రీమేక్ చేద్దామని కొందరు తమిళ దర్శకులు రజనీకాంత్ ను సంప్రదించారు. దాంతో రజనీకాంత్ సింహాద్రి మూవీ చూసి ఒకింత షాక్ కు గురై... ఆ సినిమాలో తారక్ అద్భుతమైన నటనను బాగా ప్రశంసించారు. అలాంటి మాస్ సినిమాలో నటిస్తే ఆ సినిమా హిట్టైనా.... ఆ తరువాత సినిమాలపై భారీగా అంచనాలు పెరుగుతాయని... అలా జరిగితే భవిష్యత్తులో అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయని రజనీ జోస్యం కూడా చెప్పారు. 

 

సింహాద్రి హిట్ తరువాత తారక్ కూడా ఆ స్థాయి హిట్ లేక కొంతకాలం ఇబ్బంది పడినా... మళ్లీ చక్కన తో జతకట్టి యమదొంగ సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు. కేవలం రెండు పదుల వయస్సులోనే తారక్ రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ చేత ప్రశంసలు అందుకోవడం మామూలు విషయం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: