స్విట్జర్లాండ్ లో స్టూడెంట్ నెంబర్. 1 పాటల చిత్రీకరణ పూర్తి చేసుకొని ఆ సినీ బృందం ఇంటికి తిరుగు ముఖం పట్టగా... వారి వద్దకు నల్లమలపు శ్రీనివాస్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ను కలుసుకొని... అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న వివి వినాయక్ ని పరిచయం చేసి... 'తారక్ గారు, మీకు సరిపోయే కథ ఒకటి ఆయన(వివి వినాయక్) తయారు చేశాడు. ఒకసారి ఆ కథను వింటారా?' అని అడిగారు. వాళ్ళు అంతకుముందు ఎక్కువగా పరిచయం లేని వ్యక్తులు కావడం... అలాగే ఆ సమయంలో చాలామంది తనని విసిగిస్తున్నడంతో... ఎన్టీఆర్ వివి వినాయక్ తో ఇలా అన్నాడు... నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నన్ను ఒక్కసారి కలవండి' అని వెళ్ళిపోయాడు. 

 


ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చాడో అప్పటినుండి నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి) తరచూ ఫోన్ చేసి సినిమా కథ వినండి సార్ అని బ్రతిమాలేవాడట. కానీ జూనియర్ ఎన్టీఆర్ కథ విని ఎందుకు అస్సలు ఆసక్తి చూపకుండా వినాయక్ కి టార్చర్ చూపించాడు. కానీ బుజ్జి మళ్లీ మళ్ళీ ఫోన్ చేయడంతో విసిగిపోయిన ఎన్టీఆర్... ఒక్కసారి కథ విని ఆ తర్వాత తనని వదిలించుకోవాలని నిర్ణయించుకొని... వివి వినాయక్ ను, బుజ్జి ని తన ఇంటికి రమ్మన్నాడు. ఆ తర్వాత రోజు ఎన్టీఆర్ ఇంటికి వివి వినాయక, బుజ్జి రాగా... ఏవండీ మొత్తం కథ వినిపించాల్సిన అవసరం లేదు. ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ మాత్రం చెప్పండి అని తారక్ అనగా... చిరునవ్వు నవ్విన వినాయక్ ఒక ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తాను మీకు నచ్చితేనే తర్వాత కథ వినండి, మా సినిమాలో నటించండి అని చెప్పడంతో ఎన్టీఆర్ ఆశ్చర్యపోయాడు. 

 


అలా అనేసి ఇంట్రడక్షన్ చెప్పడం మొదలుపెట్టాడు వివి వినాయక్. ఆ ఇంట్రడక్షన్ మొత్తం శ్రద్ధగా విన్న తారక్ వెంటనే లేచి నిలబడి ఇంట్రడక్షనే ఇంత బాగా ఉందంటే... మొత్తం సినిమా ఎలా ఉంటుందో వినాలనిపిస్తుందని మొత్తం చెప్పేయండి అనగా... వివి వినాయక్ పూర్తి సినిమా కథను రెండు గంటల పాటు తారక్ కి వినిపించాడు. ఐతే అది ఒక ప్రేమ కథ. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాని మనమందరం చేస్తున్నాం అని చెప్పగా సినీ వర్గాల్లో ఆ వార్త సంచలనం సృష్టించింది. అప్పట్లో కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ బాగా సన్నిహితులు. జూ. ఎన్టీఆర్ ప్రేమ కథ చిత్రం లో నటిస్తున్నాడని తెలిసిన కొడాలి నాని వెంటనే అతని వద్దకు వచ్చి ఈ దశలో నువ్వు ప్రేమకథా చిత్రాలు తీయడం అంత మంచిది కాదని, యాక్షన్ సినిమాలు చేస్తేనే బాగుంటుందని సజెస్ట్ చేశారు. సరే అనేసి వినాయక్, బుజ్జిలను పిలిపించి... మీ దగ్గర ఏదైనా మాస్ సినిమా స్రిప్టు ఉంటే వినిపించండి. నేను మాస్ సినిమాల్లో మాత్రమే నటిస్తాను అని తేల్చిచెప్పేశాడు. 


దీంతో ఒక్కసారిగా డీలా పడ్డ వినాయక్ ఆలోచనలో పడిపోయాడు. ఆ సమయంలోనే అతనికి ఎప్పుడో రాసుకున్న రెండు సన్నివేశాలు గుర్తుకి వచ్చాయి. వాటిలో ఒకటి చిన్నపిల్లోడు బాంబు వేసే సన్నివేశం కాగా... మరొకటి గాల్లోకి టాటా సుమో లు ఎగిరే సన్నివేశం. ఆ రెండు సన్నివేశాలను తారక్ కి వినిపించి... మీకు ఇవి నచ్చినట్లయితే నేను కథ రెడీ చేసుకుంటాను అని అనగా జూనియర్ ఎన్టీఆర్ జోక్యం మరీ అంత యాక్షన్ సినిమా నాకు హెవీ అయిపోతుందేమో అని సందిగ్ధత వ్యక్తం చేయగా... కేవలం ఒకే ఒక్క వారం రోజులు నాకు సమయం ఇవ్వండి. పూర్తి కథను రెడీ చేసుకొని నీకు వినిపిస్తాను నచ్చితేనే మీరు చేయండి లేకపోతే లేదు అని వి.వి.వినాయక్ చెప్పాడు.

 

దానికి అంగీకరించిన ఎన్టీఆర్ కి బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిన వివి వినాయక్ స్నానం చేయకుండా, నిద్ర పోకుండా ఆహారం కూడా తీసుకోకుండా కథను 2-3 రోజుల్లోనే పూర్తి చేశాడు. ఆ తర్వాత అర్థరాత్రి మూడు గంటల సమయంలో తన బుజ్జి ని నిద్ర లేపి కథ పూర్తి చేశాను ఒకసారి విను అని వినిపించగా బుజ్జి కథ బాగా నచ్చేసింది. తదనంతరం తారక్ దగ్గరికి వెళ్లి 50 సీన్లను నరేట్ చేయగా... బాగా ఎగ్జైట్ అయిన తారక్ సినిమా చేద్దామని చెప్పేసాడు. తదనంతరం సినిమా చిత్రీకరణ పూర్తయి ఆది పేరుతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అలాగే ఆ సినీ బృందం లో పాల్గొన్న వారందరికీ మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఆ సినిమాతో వి.వి.వినాయక్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: