ఈ మధ్య చిన్న చిన్న హీరోలు కూడా కమర్షియల్ సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేయడంతో దర్శక నిర్మాతలు కూడా అదే విధంగా ప్లాన్ చేసారు. పాన్ ఇండియా వైడ్ గా ఆడకపోయినా పర్వాలేదు గాని ఓటీటీ ఫ్లాట్ ఫాం లో సినిమాను ప్రేక్షకులు చూసినా సరే చాలు అనుకునే విధంగా సినిమాలను తీసుకొస్తున్నారు. తెలుగులో ఆడి ఓటీటీ ఫ్లాట్ ఫాం లో హిట్ అయినా చాలు అనే భావన లో ఉన్నారు. ఇక దీనికి తోడు తెలుగులో సినిమా తీసినా దాని డ‌బ్బింగ్ హ‌క్కులు హిందీతో పాటు ప‌లు భాష‌ల్లోకి ముందే అమ్మేస్తున్నారు. అంతెందుకు బెల్లంకొండ శ్రీనివాస్ తీసిన డిజాస్ట‌ర్ సినిమాల హిందీ డ‌బ్బింగ్ రైట్స్ కు కూడా కోట్లాది రూపాయ‌ల రేటు ప‌లికాయంటేనే మ‌న తెలుగు సినిమాల‌కు అక్క‌డ ఉన్న క్రేజ్‌, డిమాండ్ అర్థ‌మ‌వుతోంది. 

 

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు మ‌న హీరోల‌కు ఉన్న క‌మ‌ర్షియ‌ల్ పిచ్చే  చిన్న హీరోల కొంప ముంచింది అని అంటున్నారు టాలీవుడ్ జనాలు. అది ఏంటీ అంటే... నానీ ఒక సినిమాను చేయడానికి ఒక దర్శకుడి తో మాట్లాడినట్టు సమాచార౦. సినిమాను పాన్ ఇండియా వైడ్ గా తీసుకుని వద్దామని చెప్పగా సరే అని దర్శకుడు నిర్మాతతో మాట్లాడి పారితోషికం ఫైనల్ చేసుకోవాలని నానీకి చెప్పగా పాన్ ఇండియా సినిమా కాబట్టి ఎక్కువ అడిగాడ‌ట‌. 

 

అసలే లాక్ డౌన్ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు ఇప్పుడు అంత అవసరమా అన్నట్టు మాట్లాడిన నిర్మాత మళ్ళీ చెప్తాను అని చెప్పాడట. అదే కథను దర్శకుడు నాగ చైతన్య కు వినిపించగా... ఓకే చేసాడని ఎక్కువ అడగలేదు అని ఆ సినిమాను ఫైనల్ చేసారు అని తెలుస్తుంది. ఆ సినిమాను వచ్చే ఏడాది తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. సో నాని రెమ్యున‌రేష‌న్ ఎఫెక్ట్ తో ఇప్పుడు చైతుకు క‌లిసొచ్చింద‌న్న మాట‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి: