మన తెలుగు హీరోలకు ఇప్పుడు కమర్షియల్ పిచ్చి అనేది దాదాపుగా పెరిగిన సంగతి తెలిసిందే. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే కమర్షియల్ గానే ఉండాలి అని భావిస్తున్నారు. అగ్ర హీరోలు కూడా అదే విధంగా ఆలోచన చేస్తున్నారు. అయితే దీని కారణంగా ఇప్పుడు నిర్మాతలు దర్శకులు బాగా ఇబ్బంది పడుతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. సినిమాను తీసుకుని రావడానికి నానా కష్టాలు పడుతుంటే కమర్షియల్ సినిమాలు అంటూ నరకం చూపిస్తూ సినిమా ఖర్చు ని భారీగా పెంచేస్తున్నారు అనే భావన లో దర్శక నిర్మాతలు ఉన్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. 

 

అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న దర్శక నిర్మాతలు ఇక కమర్షియల్ సినిమాలు వద్దు అనే అభిప్రాయానికి వచ్చేశారు అని తెలుస్తుంది. చిన్న చిన్న సినిమాలను తీసి హిట్ కొట్టాలి అని స్టార్ హీరో తో సినిమా చేసినా సరే కమర్షియల్ అనేది వద్దు అని భావిస్తున్నారు అని సమాచారం. ఇదే విషయాన్ని హీరోలకు చెప్పారు అని తెలుస్తుంది. ప్రస్తుత౦ మన తెలుగులో చాలా మంది హీరోలు పాన్ ఇండియా సినిమాల మీద దృష్టి పెట్టి సినిమాలను ఆలస్యం చేస్తున్నారు. ఆలాంటి ప్రయత్నాలు వద్దు అని తాము అంత దూరం వేచి చూడలేము అని నిర్మాతలు చెప్పెసినట్టు తెలుస్తుంది. 

 

ఏ స్టార్ హీరో అయినా సరే ఇదే విషయాన్ని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు అని తెలుస్తుంది. మన తెలుగులో చాలా మంది హీరోలు ఇప్పుడు సినిమాల విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాని అది సాధ్యం కావడం లేదు. ఎప్పుడు సినిమా వస్తుంది అనేది చెప్పడం కూడా చాలా కష్టంగా మారింది ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో. దీని నుంచి బయటకు వస్తేనే సినిమా బ్రతుకుతుంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: