సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ స‌మంత‌కు పెళ్లికి ముందు... పెళ్లి త‌ర్వాత కూడా ప‌ట్టింద‌ల్లా బంగారం అన్న‌ట్టుగానే న‌డుస్తోంది. పెళ్లికి ముందు స‌మంత ఏ సినిమా చేసిన సూప‌ర్ డూప‌ర్ హిట్టే. అటు త‌మిళ్ నుంచి మొద‌లుకుని ఇటు తెలుగులో స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వ‌ర‌కు ఏ సినిమా అయినా స‌మంత ఉంటే చాలు హిట్టే. అయితే ఆమె చివ‌రి సినిమా జాను మాత్ర‌మే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అంచ‌నాలు అందుకోలేక పోయింది. ఇక సమంత‌ పెళ్లి తర్వాత చేసిన‌ సినిమాల‌కు కూడా ఎక్క‌డా క్రేజ్ త‌గ్గ‌లేదు.

 

జాను సినిమా రిజ‌ల్ట్ కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఆమెకు సంబంధించి కొన్ని వార్తలు టాలీవుడ్ లో ఎక్కువగా వస్తున్నాయి. ఆమె సినిమాలు చేయడం మామ నాగార్జున కి ఇష్టం లేదని అంటున్నారు. ఈ విష‌యం కొద్ది రోజులుగా టాలీవుడ్ లో వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇది ఎంత వరకు నిజం అనేది పక్కన పెడితే వార్తలు మాత్రం ఎక్కువగానే వస్తున్నాయి. ఆమెకు కొన్ని షరతులు పెట్టినట్టు సమాచారం. అవి ఏంటీ అనేది ఒకసారి చూస్తే... సినిమాలో లిప్ లాక్ లు గాని షార్ట్ దుస్తులు గాని వేసుకోవద్దని ఇతర ప్రాంతాల్లో షూటింగ్ లు ఉంటే రద్దు చేసుకోవాలని, ఎక్కువగా కుటుంబం మీద దృష్టి పెట్టడం మంచిది అని, అనవసరంగాసినిమాలు చేయవద్దు అని చెప్పినట్టు సమాచారం. 

 

సినిమా చేసినా సరే ఇంట్లో ముందు చర్చించిన తర్వాతే ఆమెను సినిమా చెయ్యాలని సూచనలు చేసారట. దీనితో సమంతా ఒక్కసారిగా షాక్ అయింది అని వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో ఆమెకు క్రేజ్ తగ్గలేదని ఇలాంటి సమయంలో షరతులు ఎందుకు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా ఇప్పుడు నాగ్ కండీష‌న్ల‌పై అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇది నిజమో కాదో గాని ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: