టాలీవుడ్ లో ఒక హీరో సినిమా రావాలి అంటే దాదాపు రెండేళ్ళు పడుతుంది. ఏడాదికి పైగా సినిమా షూటింగ్ సరిపోతుంది. ఇక సినిమాను విడుదల చేయడానికి ఆ సినిమాను ప్రమోట్ చేయడానికి ఇతరత్రా కార్యక్రమాలకు కనీస౦ ఏడాది పడుతుంది. టాలీవుడ్ లో ఇప్పుడు అగ్ర హీరోల సినిమాలు అన్నీ కూడా దాదాపుగా ఇదే పరిస్థితిలో ఉన్నాయి అనేది వాస్తవం. ఇది నిర్మాతలకు కూడా కాస్త ఇబ్బంది గానే మారింది. ఇక అభిమానులు అయితే ఈ పరిస్థితి మీద ఇప్పుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రోజులు సినిమా ఎందుకు అనే భావన లో అభిమానులు కూడా ఉన్నారు. 

 

ఈ విధానం అవసరం లేదని దయచేసి దాని నుంచి బయటకు రావాలని హీరోలకు చాల మంది సూచనలు చేసారు అని అంటున్నారు. టాలీవుడ్ లో అగ్ర హీరో సినిమాను అభిమానులు చూడాలి అంటే కచ్చితంగా ఏడాది కి పైగా సమయం పడుతుంది అనేది స్పష్టంగా చెప్పవచ్చు. అనవసరంగా సమయాన్ని వృధా చేస్తున్నారు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు హీరోలు కూడా ఇప్పుడు ఈ విషయంలో ఆలోచనలో పడ్డారు అని తెలుస్తుంది. ఆలస్యం అయితే సినిమాలు పోతున్నాయి అని భావిస్తున్నారు. 

 

ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఎక్కువగా నష్టపోయాం అనే భావన హీరోలకు ఉంది అని అంటున్నారు. ఇదే ఎక్కువ సినిమాలను చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు అనే భావన ఇప్పుడు హీరోలు వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా మంచి కథలను విన్నా సరే వదులుకున్నాం అని మహేష్ బాబు ప్రభాస్ చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు కూడా చేస్తూ వచ్చారట. ఇప్పుడు సినిమాలను కనీసం ఏడాదికి రెండు విడుదల చేస్తే మంచిది అనే భావన లో వాళ్ళు ఉన్నారు అని అంటున్నారు. మరి ఏ హీరో విడుదల చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: