యంగ్ టైగర్ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ లో వున్న పిక్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న సాయంత్రం ఎన్టీఆర్ ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ ఆ పిక్ ను విడుదలచేశాడు. ప్రముఖ ఫొటో గ్రాఫర్ డాబూ రత్నాని ఆపిక్ ను తీయడం విశేషం. సిక్స్ ప్యాక్ లో వున్న ఎన్టీఆర్ ఫోటో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
 
ఇక ఎన్టీఆర్ పిక్ కు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా  ఫిదా అయ్యాడు దాంతో వర్మ తనకు ఎంతలా నచ్చిందో ట్వీట్ ల ద్వారా  తెలియజేస్తున్నాడు. ఇప్పటివరకు ఆ పిక్ గురించి రెండు ట్వీట్ లు చేసిన వర్మ.. మియా మాల్కోవా తరువాత నేను చూసిన బెస్ట్ బాడీ ఇదే నంటూ ఓ ట్వీట్ లో పేర్కొనగా రెండో ట్వీట్ లో ఆ బాడీ ఏంట్రా నాయన అంటూ ట్వీట్ చేశాడు. 
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే అయితే లాక్ డౌన్ వల్ల ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ కాదు కదా ఫస్ట్ లుక్ కూడా విడుదలచేయడం లేదని మేకర్స్ ప్రకటించారు.  రాజమౌళి డైరెక్షన్ లో మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ , కొమురం భీమ్ గా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించనున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: