ముఖ్యంగా టాలీవుడ్ యువ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించే సినిమాల్లో ఆయన నటన, డ్యాన్స్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేసే అలవాటున్న ఎన్టీఆర్, తన తాతయ్య నందమూరి తారకరామారావు గారి వలె ఎంతో గొప్పగా డైలాగులు చెప్పడంలో దిట్ట అనే చెప్పాలి. ఇకపోతే తన కెరీర్ లో మొత్తంగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళితో మూడు సినిమాలు చేసిన ఎన్టీఆర్, ప్రస్తుతం ఆయనతో నాలుగవ సినిమా అయిన ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపొతే తొలిసారిగా రాజమౌళి మెగాఫోన్ పట్టిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా మొదలైన ఎన్టీఆర్, రాజమౌళి మధ్య అనుబంధం, సినిమా సినిమాకు మరింతగా పెరిగి నేడు ఎంతో గొప్ప బంధంగా మారింది. 

 

తనకు కెరీర్ పరంగా హీరోగా తొలి అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ అంటే రాజమౌళికి ఎంతో కృతజ్ఞత అనేది ఆయన పలు సందర్భాల్లో ఎన్టీఆర్ గురించి ప్రస్తావించిన విషయాలను బట్టి చెప్పవచ్చు. ఇకపోతే కెరీర్ పరంగా ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ తరువాత సింహాద్రి సినిమా చేసిన రాజమౌళి, మూడవసారి ఆయనతో యమదొంగ సినిమా చేసే సమయంలో జరిగిన ఒక ఘటన గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భగంగా రాజమౌళి ప్రస్తావించారు. తన సింహాద్రి సమయంలో కొంత ముద్దుగా బొద్దుగా ఉన్న ఎన్టీఆర్, కృష్ణవంశీ గారి రాఖీ సినిమా సమయానికి ఎంతో లావుగా తయారవడం తనకు రుచించలేదని, అదే విషయాన్ని ఎన్టీఆర్ కు చెప్పి, తన తదుపరి చేయబోయే యమదొంగ కథను కూడా వినిపించానని అన్నారు. అయితే నువ్వు ముందుగా శరీరకముగా ఎంతో బరువు తగ్గాలి, దాని తరువాతనే మనం సినిమా చేద్దాం అని అన్నారట. 

 

కాగా తన మంచి కోరే జక్కన్న చెప్పిన మాటని విన్న ఎన్టీఆర్, అక్కడి నుండి రోజు డైట్, ఎక్సర్ సైజుల వంటివి ఎంతో శ్రద్దగా పాటించి, అతి తక్కువ కాలంలోనే బరువు పూర్తిగా తగ్గాడని అన్నారు. ఎవ్వరికీ తెలియని సీక్రెట్ ఏంటంటే, ఎన్టీఆర్ లో ఉండే ఎనర్జీ లెవెల్స్ ఎంతో ఎక్కువ అని, బొద్దుగా ఉన్న సమయంలోనే నటన, డ్యాన్స్ లు దంచేసిన ఎన్టీఆర్, పూర్తిగా బరువు తగ్గిన తరువాత తమ యమదొంగ సినిమాలో మరింత గొప్పగా వాటిని పెర్ఫర్మ్ చేసి అభిమానులతో పాటు అటు ఆడియన్స్ హృదయాలు కూడా గెలుచుకున్నారని అన్నారు. అలానే మరొక సీక్రెట్ ఏంటంటే, ఎన్టీఆర్ తో కాసేపు కూర్చుని మాట్లాడితే చాలు వాళ్ళు ఆయనకు మంచి మిత్రులుగా మారిపోవడంతో పాటు వారిని తన మాటలతో తనవైపుకు తిప్పేసుకుంటాడని రాజమౌళి సరదాగా చెప్పడం జరిగింది. మొత్తంగా తన హీరో ఎన్టీఆర్ నేడు పుట్టినరోజు జరుపుకోబోతుండడంతో జక్కన్న ఏ విధంగా విషెస్ తెలియచేస్తారో చూడాలి....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: