సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నందమూరి ఫ్యామిలీ ఇమేజ్ కాపాడింది బాలకృష్ణనే.. ఆ తర్వాత వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా చాటుతూ వచ్చాడు. సీనియర్ ఎన్టీఆర్ లా ఉండటమే ఆయనకు చాలా ప్లస్ అయ్యింది. రాజమౌళి డైరక్షన్ లో స్టూడెంట్ నంబర్ 1 సినిమాలో ఒక సీన్ లో అచ్చం అన్నగారేనా అనేలా ఆడియెన్స్ ఆశ్చర్యపోయేలా చేశాడు. కెరియర్ స్టార్టింగ్ లోనే హిట్లు సూపర్ హిట్లు కొట్టిన తారక రాముడు మధ్యలో కొన్నాళ్ళు ఎలాంటి సినిమాలు చేయాలో తికమకపడ్డాడు. ఫైనల్ గా టెంపర్ నుండి మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. 


ఎన్టీఆర్ 28 సినిమాల కెరియర్ లో బాలకృష్ణకు హిట్ ఇచ్చిన ఇద్దరు దర్శకులతో ఒక్కో సినిమా చేయగా అవి డిజాస్టర్ కా బాప్ అనేలా చేశాయి. బాలయ్య బాబుకు ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చిన బి.గోపాల్ డైరక్షన్ లో ఎన్టీఆర్ నటించిన నరసింహుడు నందమూరి ఫ్యాన్స్ ను భయపెట్టేలా చేసింది. ఇక అదే తరహాలో బాలయ్యకు వరుస హిట్లు ఇస్తూ వస్తన్న బోయపాటి శ్రీను డైరక్షన్ లో కూడా ఎన్టీఆర్ దమ్ము సినిమా చేశాడు. ఆ సినిమా రిజల్ట్ కూడా తెలిసిందే. సో ఈ లెక్కన చెబితే బాలకృష్ణకు హిట్ ఇచ్చిన దర్శకులు ఎవరు ఎన్టీఆర్ కు సెట్ అవ్వరని అర్ధమైంది. 


నరసింహుడు సినిమా అయితే ఎన్టీఆర్ కెరియర్ లో మర్చిపోలేని సినిమా అని చెప్పుకోవచ్చు. సింహాద్రి లాంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న తారక్ పూరి జగన్నాథ్ తో ఆంధ్రావాలా అంటూ అదరగొడతాడని అనుకుంటే అది కాస్త తుస్సుమనిపించాడు. ఆ తర్వాత సాంబ పర్వాలేదు అనిపించగా నా అల్లుడు, నరసింహుడు రెండు ప్లాప్ అయ్యాయి. ఆ తర్వాత అశోక్ సినిమా పర్వాలేదు అనిపించగా రాఖీ సినిమా మళ్ళీ హిట్ గా నిలిచింది.     

మరింత సమాచారం తెలుసుకోండి: