సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులతో నటుడిగా మొదలుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్థానం చేసింది 28 సినిమాలే అయినా ఈ తరం హీరోల్లో పౌరాణికం చేయాలంటే అది ఒక్క ఎన్టీఆర్ వల్లే అవుతుంది అనేలా సత్తా చాటుతున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పాత్ర చేయగలడు.. ఈ పాత్ర చేయలేదు అన్న కొలమానాలు ఏవి లేవు.. డైరక్టర్ క్యారక్టర్ చెప్పాలే కానీ దానిలో పరకాయ ప్రవేశం చేసి తన స్టామినా ఏంటో చూపిస్తాడు. 


నటుడిగా ఎన్టీఆర్ ఇప్పుడున్న స్థాయి కన్నా ఇంకా ఎన్నో రేట్లు ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే నందమూరి హీరోల్లో బాలకృష్ణ తర్వాత ఎంట్రీ ఇచ్చినా బాలయ్యకు అటు ఇటుగా ఇప్పుడున్న స్టార్స్ కు  ధీటుగా ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్న తారక్ కేవలం హీరోగానే కాదు రాజకీయవేత్తగా ఎదగాలన్నది అభిమానుల కోరిక. నటన రాజకీయం ఇంకా ఎన్టీఆర్ మీద చాలా బాధ్యతలు ఉన్నాయనే విషయాన్ని అప్పుడప్పుడు గుర్తుచేస్తారు. 


అందుకే తాత, తండ్రి ఇచ్చిన ఈ జీవితాన్ని ప్రతి నిమిషం బాధ్యతగా ఉంటూ వస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. నటుడిగానే కాదు పాలిటిక్స్ లో కూడా ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం కేవలం సినిమాల మీదనే దృష్టి పెట్టిన ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి వస్తే మాత్రం మళ్ళీ హిస్టరీ రిపీట్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. నటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న తారక్ రాజకీయవేత్తగా తాత చూపిన బాటలో నడుస్తాడని ఆశిస్తున్నారు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని నందమూరి ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆరోజంటూ రావాలే కానీ మరో అధ్యాయం మొదలైనట్టే అని చెప్పుకోవచ్చు. తప్పకుండా అది జరిగే తీరుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.               

మరింత సమాచారం తెలుసుకోండి: