37 ఏళ్ల వయసు.. 30 సినిమాల అనుభవం.. కోట్ల మంది అభిమాన గణం.. నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ సాధించిన ఖ్యాతి ఇది. నందమూరి ఫ్యామిలీ నుండి అన్నగారి తర్వాత బాలకృష్ణ నట ప్రస్థానం కొనసాగించగా ఆ వారసత్వాన్ని అందుకున్నాడు తారక రాముడు. అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన పనిలేదు డైలాగ్ లానే నూనూగు మోసాల టైంలోనే రికార్డులతో చెడుగుడు ఆడిన తారక్ ఇప్పుడు వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు.   

 

డైరక్టర్ ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేయడంలో తనకు తానే సాటి అనిపించుకుంటాడు. అంతేకాదు ఈతరం నటులలో పౌరాణిక పాత్రలు చేయాలంటే అది ఎన్టీఆర్ మాత్రమే. వేరే స్టార్స్ ప్రయత్నించడానికి వెనుకడుగు వేస్తారు కానీ ఎన్టీఆర్ మాత్రం పాత్ర ఏదైనా ఘట్టమేదైనా నేను రెడీ అనేస్తాడు. డైరక్టర్ రాసుకున్న పాత్రలో ఎన్టీఆర్ ను అలా చూస్తూ ఉండిపోవాలి అన్నంతగా ఆయన అభినయం ఉంటుంది. 

 

ఎన్టీఆర్ ఒక స్టార్ హీరో అని చెప్పడం కన్నా ఒక గొప్ప నటుడు అని చెప్పడం కరెక్ట్. హీరో అంటే ఒకే ఇమేజ్ చట్రంలో ఇరుక్కుని పోయి ప్రయోగాలు చేయలేకపోతాడు. అలా కాకుండా నిన్ను చూడాలని నుండి అరవింద సమేత వరకు ఎన్టీఆర్ తనని తానూ మలచుకున్న తీరు ఎంతోమందికి ఆదర్శమని చెప్పొచ్చు. అందుకే ఆయన్ను ఈతరం నట శిఖరం అంటూ కొందరు కొనియాడుతారు. అవును నిజమే ఈ మాట కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఎన్టీఆర్ డైలాగ్ చెబితే బాక్సాఫిస్ బద్దలవ్వాల్సిందే. తాను డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ ఫ్లోర్ ఊగిపోవాల్సిందే. కరెక్ట్ సినిమా పదాలే కానీ రికార్డులన్నీ మడత పెట్టి సరికొత్త సంచలనాలు సృష్టించగలిగే సత్తా.. స్టామినా ఉన్న నటుడు నందమూరి తారక రామారావు.. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన జూనియర్ ఎన్టీఆర్ కు ఇండియాహెరాల్డ్.కామ్ తరపున స్పెషల్ గా బర్త్ డే శుభాకాంక్షలు అందిస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తుంది ఇండియాహెరాల్డ్.కామ్ టీం. 

మరింత సమాచారం తెలుసుకోండి: