జూనియర్ ఎన్టీఆర్... చాలా మందికి ఈ తరం సినిమా ప్రేక్షకులకు ఈ పేరు ఒక ఊపు. ఆ హీరోహీరో అనే తేడా లేదు. దాదాపు అందరు హీరోల అభిమానులు బాబు కి ఫాన్స్. ఏ సినిమా వచ్చినా ఏ దర్శకుడు అయినా సరే తారక్ హీరో అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే పరిస్థితి ఉంటుంది. కన్నడ లో అయినా తెలుగులో అయినా సరే అతని సినిమాలను ఎక్కువగా చూస్తూ ఉంటారు. స్టార్ హీరోల అభిమానులు అందరూ కూడా అతని సినిమాలను ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. సోషల్ మీడియా లో కూడా అతని గురించి అందరూ మాట్లాడే పరిస్థితి ఉంటుంది. 

 

అతని సినిమా వస్తుంది  అంటే చాలు దాదాపుగా అందరూ టికెట్స్ బుక్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అతని వ్యక్తిత్వానికి అతని నటనకు ఎందరో అభిమానులు ఉన్నారు. ఇండియన్ సినిమాలో అరుదైన హీరో అని కూడా కొందరు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ హీరో కి లేని ఇమేజ్ అతనికి ఉంది. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే తనకు తానుగా పైకి వచ్చే ప్రయత్నం చేసాడు తారక్. ఎవరి సహాయ సహకారాలను ఏ రోజు కూడా తీసుకునే అవసరం గాని అతనికి ఆ గతి గాని ఎప్పుడు కూడా పట్టలేదు అని చెప్తూ ఉంటారు. 

 

టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో ఆ స్థాయిలో పాపులర్ అయిన హీరో అతను ఒక్కడే. కేవలం నటన కోసం అతను పడిన తపన అతను పడిన కష్టం గురించి ఎంత చెప్పినా ఏది చెప్పినా ఎలా చెప్పినా సరే తక్కువే  అవుతుంది. అందరూ తమకు ఉన్న బ్యాక్ గ్రౌండ్ ని వాడుకుని సినిమాలు చేస్తే తారక్ మాత్రం ఏ రోజు కూడా ఆ ప్రయత్నం కూడా చేసిన సందర్భం అనేది ఎప్పుడు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: