నందమూరి నట వారసుడిగా వెండితెరకు  పరిచయం అయిన ఎన్టీఆర్ తనదైన గుర్తింపు తో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా యంగ్ జనరేషన్‌ నటీనటుల్లో ఎన్టీఆర్ అద్భుతమైన నటుడన్న పేరుంది. చాలా మంది దర్శకులు కూడా ఇదే అభిప్రాయన్ని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌లోని నటుడిని తెర మీద అద్భుతంగా ఆవిష్కరించి సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్‌, మాస్‌, ఎమోషనల్‌ సీన్స్‌లో ఎన్టీఆర్ నటన పీక్స్‌లో ఉంటుంది. అందుకే మాస్ ఆడియన్స్‌లో ఆయనకు తిరుగులేని ఫాలోయింగ్ వచ్చింది. ఆ ఫాలోయింగ్‌ వల్లే ఎన్టీఆర్ ఈ జనరేషన్‌ టాప్‌ స్టార్స్‌ లిస్ట్‌లో చేరిపోయాడు.

 

అయితే ఎన్టీఆర్ ఎన్ని సీన్స్ చేసినా ఎప్పటికీ గుర్తిండి పోయే సన్నివేశాలు మాత్రం కొన్నే ఉంటాయి. ఆ సన్నివేశాల కారణంగానే ఎన్టీఆర్ అద్భుతమైన నటుడన్న విషయం పరిచయం అయ్యింది. అలాంటి అరుదైన సన్నివేశాల్లో ఒకటి రాఖీ సినిమాలోని కోర్ట్ సీన్. ఎన్టీఆర్ కెరీర్‌లో బెస్ట్ మూవీస్‌లో రాఖీ ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్‌ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పీక్‌ స్టేజ్‌ ఎమోషన్స్‌ను చూపించాడు. తన చెల్లి చనిపోయిన విషయం తెలిసినప్పుడు ఎన్టీఆర్‌ నటన కంటతడి పెట్టిస్తుంది. ఇక ఇదే సినిమాలోని మరో సన్నివేశం క్లైమాక్స్ కోర్ట్‌ సన్నివేశం. ఈ సీన్‌లో గుక్క తిప్పుకోకుండా డైలాగ్స్ చెప్పి అభిమానులను ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచాడు తారక్‌.

 

ఇలాంటిదే మరో అద్భుతమైన సన్నివేశం టెంపర్‌ సినిమాలోనిది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో ఎన్టీఆర్ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించాడు. ఓ కరెప్టెడ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కారణంగా ఓ అమ్మాయికి జరిగిన నష్టం, ఆ తరువాత ఆ అమ్మాయికి న్యాయం చేయటం కోసం ఆ పోలీస్‌ ఆఫీసర్ చేసిన త్యాగం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో ఎన్టీఆర్ చేసిన క్లైమాక్స్ సీన్‌కు థియేటర్లలో విజిల్స్ పడ్డాయి. ఈ సీన్‌లో ఎన్టీఆర్‌ నటనకు ప్రేక్షకులు నిరాజనం పట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: