ప్రపంచంలో కంటికి కనిపించని సూక్ష్మజీవి కరోనాతో యుద్ధంచేసి కరోనాని పూర్తిగా ఓడించలేక ఇప్పుడు కరోనాతో సహజీవనం తప్ప మరోమార్గం లేదు అన్నవాస్తవాన్ని గ్రహించి నిన్నటి నుండి మన తెలుగు రాష్ట్రాలలో జనజీవనం సాధారణ స్థాయిలోకి రావడం ప్రారంభం అయింది. అన్ని షాపులు ఆఫీసులు తెరుచుకోవడంతో భాగ్యనగరం రోడ్లు ఎప్పటి లానే జనంతో వాహనాలతో కిక్కిరిసి పోయాయి. 


అనేక రంగాలకు మినహాయింపులు ఇచ్చిన ప్రభుత్వాలు సినిమా షూటింగ్ లకు కాని ధియేటర్లకు కాని మినహాయింపులు ఇవ్వకపోవడంతో షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయి అన్న విషయమై ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. ఫిలిం ఇండస్ట్రీని ధియేటర్లను నమ్ముకుని మన తెలుగురాష్ట్రాలలో 50వేల కుటుంబాలు ఉండటంతో ఇండస్ట్రీ ప్రముఖులు వారికికొంత సహాయం చేస్తున్నా అది ఏమాత్రం సరిపోవడంలేదు అన్నమాటలు వినిపిస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో ఈకుటుంబాలు అన్నీ గట్టెక్కాలి అంటే సినిమా షూటింగ్ లు తిరిగి ప్రారంభంకావడం అదేవిధంగా ధియేటర్లు ఓపెన్ అవ్వడం తప్పించి మరొకమార్గం లేదు. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వాలు చాల కఠిన నిబంధనలు పెట్టి ముందుగా కొన్ని ప్రైవేట్ స్టూడియోలలో షూటింగ్ లు మొదలుపెట్టుకోవడానికి వచ్చేనెల నుండి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది అన్నలీకులు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఈషూటింగ్ లకు ఊహించని విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీ శాపంగా మారుతుందా అన్నసందేహాలు కొందరు వ్యక్తపరుస్తున్నారు. 


తెలుస్తున్న సమాచారం మేరకు అనేక బాలీవుడ్ నిర్మాణ సంస్థలు తమ షూటింగ్ లను హైదరాబాద్ స్టూడియోలలో జరుపుకోవడానికి ఇప్పటి నుండే భాగ్యనరంలోని స్టూడియోలలో ఏకంగా అనేక ఫ్లోర్లు చాలముందుగా బుక్ చేసుకుని ఇప్పటి నుండే వారి సినిమాలకు సంబంధించిన సెట్స్ నిర్మాణం ఇక్కడి కార్మికులతో చేయిస్తున్నట్లు టాక్. దీనితో ఒకసారి షూటింగ్ లు అంటూ మొదలైతే భాగ్యనగరంలోని స్టూడియోలలో ఒక్క ఫ్లోర్ కూడ ఖాళీ లేకుండా అన్నీ నటీనటులు టెక్నిషియన్స్ తో నిండిపోయే ఆస్కారం ఉంది. దీనితో తెలుగుసినిమాల షూటింగ్ లు మొదలైనా బాలీవుడ్ నుండి వచ్చే అనేకమంది స్టార్స్ నుండి చిన్నచిన్న కళాకారులు టెక్నిషియన్స్ తో స్టూడియోలు నిండిపోతే ప్రస్తుతం దేశంలో కరోనాకు సంబంధించి అత్యధిక కేసులు రన్ అవుతున్న ముంబాయి ప్రాంతం నుండి వచ్చే అనేకమంది స్టార్స్ టెక్నీషియన్స్ మధ్య తమ సినిమాలు మొదలైనా ఈబాలీవుడ్ సమూహం వల్ల పొరపాటున టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరికైనా కరోనా వ్యాధి సోకితే తమపరిస్థితి ఏమిటి అంటూ త్వరలో షూటింగ్ లు మొదలుపెట్టబోయే తెలుగుసినిమాలకు సంబంధించిన నటీనటులు సాంకేతిక నిపుణులు విపరీతంగా భయపడుతున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: