టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లక్షణాలు కొన్ని ఉంటాయి. టాలీవుడ్ లో కొందరు హీరోలు తాము స్టార్ హీరోలు అయిన తర్వాత దర్శక నిర్మాతలను పెట్టే బాధల గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. ఏ హీరో అయినా సరే దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తూ ఉంటారు. డేట్స్ విషయంలో గాని మరొక విషయంలో గాని వాళ్ళు చూపించే నరకం అంతా ఇంతా కాదు అనే చెప్పుకోవాలి. కాని జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అలా ఎప్పుడు లేదు అని అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఒక సినిమా ఒప్పుకుంటే  ఆ సినిమా పూర్తి అయిన తర్వాతే... 

 

మరో సినిమా కథ వినడం ఆ సినిమాను చేయడం చేస్తాడు అని ఖాళీ దొరికితే కథ విని లైన్ లో పెట్టుకోవడమే గాని మరో సినిమాను ఈ సినిమా చేస్తూ ఉండగా చేసిన సందర్భం అనేది ఎక్కడా ఉండదు అని అంటారు. ఏ సినిమా అయినా ఏ దర్శకుడు అయినా సరే అతను ఇదే విధంగా ఉంటాడు అని డేట్స్ ఇస్తే పూర్తిగా ఒక సినిమాకే ఇస్తాడు అని అతను ఎంత బిజీ గా ఉన్నా సరే సినిమా ఒప్పుకున్నా తర్వాత కచ్చితంగా పూర్తి చేసే మరో సినిమా మీద దృష్టి పెడతాడు అని అంటారు టాలీవుడ్ జనాలు. అందుకే చాలా మంది దర్శక నిర్మాతలు అతని కోసం ఎదురు చూసే సందర్భాలు ఉన్నాయని అంటారు. 

 

హీరో కూడా టాలీవుడ్ లో ఇలా లేరు అని అంటారు. ఒక సినిమా చేస్తూనే ఇంకో సినిమా చేయడానికి ఎదురు చూస్తారని ఈ సినిమాను ఇబ్బంది పెడతారు అని అంటారు. కాని బాబు మాత్రం అలాంటి వ్యక్తి కాదు అనేది చాలా మంది చెప్పే అభిప్రాయం. అందుకే దర్శకులకు అతను అంటే ఇష్టం అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: