నటుడిగా నందమూరి యువ నటుడికి వంక పెట్టడానికి లేదు. అద్భుతమైన పాత్రలతో పాటు బ్లాక్ బస్టర్స్ హిట్స్ తో నందమూరి అభిమానులను ఓ రేంజ్లో అలరిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే ఈ జనరేషన్ అగ్రకథానాయకుల్లో ఒకడిగా ఎదిగిన ఎన్టీఆర్ తన కెరీర్లో ఎన్నో పొరపాట్లు చేశాడు. అలాంటి ఓ బిగ్ మిస్టేక్ శక్తి మూవీ. మెగా దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. వైజయంతి మూవీస్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా దారుణంగా ఫెయిల్ అయ్యింది. కథా కథనాలతో పాటు టేకింగ్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవటంతో ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది.
ఈ సినిమా ఫెయిల్ అవ్వటంలో మరో ప్రధాన కారణంగా ఎన్టీఆర్ లుక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశాడు. ఒక పాత్రలో పోలీస్ ఆఫీసర్ శక్తి స్వరూప్‌గా కనిపించగా మరో పాత్రలో శక్తి పీఠాల రక్షకుడు రుద్రగా కనిపించాడు. అయితే శక్తి స్వరూప్ లుక్ కాస్త పరవాలేదనిపించినా, రుద్ర లుక్ మాత్రం దారుణం. భయకరమైన విగ్‌తో ఈ క్యారెక్టర్లో చూడలేనంత వికారంగా కనిపించాడు. అసలు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అభిమానులు కూడా ఆ క్యారెక్టర్ విషయంలో కామెంట్లు చేశారంటే ఆ లుక్ ఏ రేంజ్లో ఫెయిల్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఎన్టీఆర్ కెరీర్లోనే వరస్ట్ లుక్ అనిపించుకుంది రుద్ర క్యారెక్టర్.
యమదొంగ సినిమాలోని ఎన్టీఆర్ లుక్ విషయంలో కూడా కాస్త విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా అప్పటి వరకు చబ్బీ చబ్బీగా కనిపించిన ఎన్టీఆర్ ఈ సినిమా కూడా బాగా సన్నబడిపోయాడు. దీంతో ఎన్టీఆర్ లుక్ కొత్తగా అనిపించింది. దానికి తోడు స్టైటినింగ్ చేయించిన లాంగ్ హెయిర్‌తో ఎన్టీఆఱ్ కొత్తగా కనిపించాడు. ఈ లుక్ కొంత మందికి ఓకే అనిపించినా మరికొంత మందికి మాత్రం అస్సలు రుచించలేదు. అయితే సినిమా కథా కథనాలతో పాటు యముడి లుక్‌లో ఎన్టీఆర్ పాత్రకు సూపర్బ్ రెస్సాన్స్ రావటంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది.