నటుడిగా నందమూరి యువ నటుడికి వంక పెట్టడానికి లేదు. అద్భుతమైన పాత్రలతో పాటు బ్లాక్ బస్టర్స్‌ హిట్స్‌ తో నందమూరి అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే ఈ జనరేషన్‌ అగ్రకథానాయకుల్లో ఒకడిగా ఎదిగిన ఎన్టీఆర్‌ తన కెరీర్‌లో ఎన్నో పొరపాట్లు చేశాడు. అలాంటి ఓ బిగ్ మిస్టేక్ శక్తి మూవీ. మెగా దర్శకుడు మెహర్‌ రమేష్‌ ఈ సినిమాకు దర్శకుడు. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా దారుణంగా ఫెయిల్ అయ్యింది. కథా కథనాలతో పాటు టేకింగ్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవటంతో ఈ సినిమా ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది.

 

సినిమా ఫెయిల్ అవ్వటంలో మరో ప్రధాన కారణంగా ఎన్టీఆర్‌ లుక్‌. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశాడు. ఒక పాత్రలో పోలీస్‌ ఆఫీసర్ శక్తి స్వరూప్‌గా కనిపించగా మరో పాత్రలో శక్తి పీఠాల రక్షకుడు రుద్రగా కనిపించాడు. అయితే శక్తి స్వరూప్‌ లుక్ కాస్త పరవాలేదనిపించినా, రుద్ర లుక్‌ మాత్రం దారుణం. భయకరమైన విగ్‌తో ఈ క్యారెక్టర్‌లో చూడలేనంత వికారంగా కనిపించాడు. అసలు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అభిమానులు కూడా ఆ క్యారెక్టర్ విషయంలో కామెంట్లు చేశారంటే ఆ లుక్‌ ఏ రేంజ్‌లో ఫెయిల్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే వరస్ట్ లుక్‌ అనిపించుకుంది రుద్ర  క్యారెక్టర్‌.

 

యమదొంగ సినిమాలోని ఎన్టీఆర్ లుక్‌ విషయంలో కూడా కాస్త విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా అప్పటి వరకు చబ్బీ చబ్బీగా కనిపించిన ఎన్టీఆర్సినిమా కూడా బాగా సన్నబడిపోయాడు. దీంతో ఎన్టీఆర్ లుక్‌ కొత్తగా అనిపించింది. దానికి తోడు స్టైటినింగ్ చేయించిన లాంగ్ హెయిర్‌తో ఎన్టీఆఱ్ కొత్తగా కనిపించాడు. ఈ లుక్‌ కొంత మందికి ఓకే అనిపించినా మరికొంత మందికి మాత్రం అస్సలు రుచించలేదు. అయితే సినిమా కథా కథనాలతో పాటు యముడి లుక్‌లో ఎన్టీఆర్ పాత్రకు సూపర్బ్ రెస్సాన్స్ రావటంతో సినిమా సూపర్‌ హిట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: