రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్.ఆర్.ఆర్ నుండి కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ని చూస్తామనుకున్న వారందరికీ నిరాశే ఎదురయింది. లాక్డౌన్ కారణాల వల్ల ప్రేక్షకులు కావాలనుకున్నది ఇవ్వలేకపోయామని చిత్రబృందం తెలియజేసింది. కారణాలేమైన కానీ ఎన్టీఆ ఫస్ట్ లుక్ చూడలేకపోతున్నామన్న బాధ అభిమానుల్లో ఉంది. అయితే ఆ బాధనంతా పక్కన పెట్టి ఎన్టీఆర్ పుట్టినరోజుని జరుపుకునే ఆలోచనలో ఉన్నారు.

 

ప్లానింగ్ కూడా పూర్తయింది. సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ అభిమానులు ట్రెండ్ చేయనున్నారు. ఏ టైమ్ కి ఏది రివీల్ చేయాలో ప్లాన్ చేసుకుని, ఎన్టీఆర్ బర్త్ డేని మెమరబుల్ గా తీర్చిదిద్దనున్నారు. సెలెబ్రిటీ హీరోలు సైతం ఎన్టీఆర్ కి స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వనున్నారు. హిట్ సినిమా ద్వారా హిట్ కొట్టిన విశ్వక్ సేన్ ర్యాప్ సాంగ్ పాడనున్నాడు. ఇంకా మహేష్ కోనేరు ఏదో సర్ ప్రైజ్ ఉండనుందని తెలియజేశాడు.

 

ఇలా ఒక్కొక్కరూ స్పెషల్ ప్లాన్స్ వేస్తున్నారు. నారా రోహిత్ ఎన్టీఆర్ కి విషెస్ చెప్తూ, ఒక ప్రత్యేక బహుమతిని ఇచ్చాడు. నారా రోహిత్ యాక్టర్ గానే మనకు తెలుసు. కానీ అతనో మంచి చిత్రకారుడన్న విషయం చాలా మందికి తెలియదు. తారక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గీసిన చిత్రం వైరల్ అయ్యింది. అరవింద సమేత చిత్రంలో చొక్కా లేకుండా, చేతిలో కత్తి పట్టుకుని నడిచొచ్చే ఫోజ్ లో తారక్ స్కెచ్ వేసి ఆహా అనిపించాడు.

 

ఎక్కడా చిన్న డీటైలింగ్ మిస్ కాకుండా అతని వేసిన ఆ చిత్రం చాలా బాగుంది.  కొన్ని సార్లు మాటల్లో చెప్పలేని అంశాలని కళల్లో చెప్పవచ్చు అంటారు. అందుకే నా నుండి నీకిచ్చే గిఫ్ట్ ఇదే.. హ్యాపీ బర్త్ డే తారక్ అంటూ ట్వీట్ చేశాడు. రోహిత్ లో మరో కళ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా బయటపడినందుకు అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: