టాలీవుడ్ లో ఉన్న యువ హీరోల్లో తారక్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని తో సినిమా చేయడానికి గాని అతని తో కలిసి నటించడానికి గానీ చాలా మంది హీరోయిన్ లు ఎదురు చూస్తూ ఉంటారు. టాలీవుడ్ లో ఏ హీరో అయినా సరే స్టార్ హీరో హోదా వచ్చిన తర్వాత కొంత మందిని చిన్న చూపు చూస్తూ ఉంటారు. కాని జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు అని అంటారు జనాలు. అతను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన సందర్భం లేదని చెప్తారు. 

 

హీరోయిన్ తో షూటింగ్ సమయంలో చాలా గౌరవం గా ఉంటాడు అని అతని స్థాయి ని మించి అతను ఏ ఒక్కటి కూడా చేసే పరిస్థితి ఉండదు అని హీరోయిన్ ని చాలగౌరవంగా చూస్తాడు అని అంటారు. కెరీర్ మొదట్లో తన సినిమాలో హీరోయిన్ ఎక్కువగా స్కిన్ షో చేయడం తనకు నచ్చదు అని దర్శక నిర్మాతలకు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అని అంటారు. కాని తర్వాత తర్వాత ఆ పరిస్థితి లేదని కమర్షియల్ కోణం లో సినిమాలు ఉన్నాయి కాబట్టి దర్శక నిర్మాతలకు ఇబ్బంది లేకుండా ఓకే చెప్పాడు అని అంటారు. 

 

దీని గురించి టాలీవుడ్ లో అప్పుడు పెద్ద చర్చలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఏ హీరో అయినా సరే హీరోయిన్ ఎలా ఉన్నా తమకు అనవసరం అంటూ ఉంటారు. కాని తారక్ సినిమాల విషయంలో అలా లేదు అని అంటారు. అందుకే అతని తో సినిమా చేయడానికి చాలా మంది హీరోయిన్ లు ముందుకు వస్తు ఉంటారని చెప్తారు. సినిమా అయ్యే వరకు కూడా వాళ్ళ గురించి అన్ని విషయాలు తెలుసుకుని ఇబ్బంది లేకుండా చూస్తాడని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: