సోషల్ మీడియా అని.. డేటింగ్ యాప్స్ అనీ.. రకరకాల వెబ్ సైట్లలో తమకు కావల్సిన వాళ్ళను వెతుక్కుని డేటింగ్ లు.. మ్యారేజ్ లు చేసుకుంటున్నారు కామన్ పీపుల్ దగ్గరనుంచి సెలబ్రిటీల వరకూ.  కాని ప్రేమంటే యాప్ ల నుండి పుట్టేది కాదంటు.. లవ్  థియరీ చెప్తొంది కియారా అద్వాని.

 

బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది కియారా. మంచి ఫామ్ ను మెయింటెన్ చేస్తుంది హీరోయిన్.  త్వరలో మరో తెలుగు సినిమాలో కూడా కనిపించబోతోంది.  కియారా టాలీవుడ్ లో రెండు సినిమాలతోనే ఆడియన్స్ చూపును తనవైపు  తిప్పుకుంది. చాలా ప్రేమ కథల్లో నటించిన కియారా అసలు ప్రేమ అంటే ఏంటో తన అభిప్రాయాన్ని చెప్పింది. 

 

ప్రేమంటే ఒకరికి మరొకరు దగ్గరగా ఉంటూ... ఇద్దరికి ఒకరిగురించి మరొకరు తెలిసుకుంటూ..  అభిప్రాయాలు కలవడమే ప్రేమ అంటోంది. ఇప్పుడు ఉన్న యూత్ డేటింగ్ యాప్స్ లో,ఫేస్ బుక్ లో, ఇన్ స్టాగ్రామ్ లో చూసి..  డేటింగ్ కి ఎట్రాక్ట్ అవుతున్నారంటోంది కియారా. తాను మనుషుల మధ్య  ప్రేమను నమ్ముతాను కాని.. ఈ టెక్నాలజీలతో పుట్టే ఆర్టిఫీషియల్  లవ్ ను యాక్సప్ట్ చేయనంటోంది కియారా.

 

చాలా మంది సోషల్ మీడియా పరిచయాలతో ప్రేమ వరకు వెళ్తున్నారు.. కొంత మంది పెళ్లిల్లు కూడా చేసుకుంటున్నారు. అందులో సినిమా వాళ్లు కూడా ఉన్నారు. కాని కియారా మాత్రం తనను బాగా ప్రేమించే వాడు..తనను తానుగా ఇష్టపడే వాడు.. తనను నవ్వించేవాడినే పెళ్ళి చేసుకుంటాను అంటోంది. అంతే కాని ముక్కుమోహం తెలియని యాప్ లతో ప్రేమ పుట్టినా.. తనకు మాత్రం అలాంటి ప్రేమ వద్దంటూ తన లవ్ థియరీనిసింపుల్ గా తేల్చేసింది కియారా . ఇప్పటికే సిద్దార్ద్ మల్‌హోత్రా తో ప్రేమాయణం నడుపుతోందన్న న్యూస్ బాలీవుడ్ లో చక్కర్లుకొడుతోంది. మరి  అమ్మడు ప్రేమలో ఉంది కాబట్టే అంతగా ప్రేమ గురించి చెబుతోంది అనుకుంటున్నారు ఫ్యాన్స్ . 

మరింత సమాచారం తెలుసుకోండి: