టాలీవుడ్ డేరింగ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఇస్మార్ట్ శంకర్ విజయంతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అంతకుముందు తీసిన చిత్రాలన్నీ వరుస ఫ్లాపులు అవుతుంటే, చాక్లెట్ బాయ్ రామ్ ని హీరోగా పెట్టి మాస్ మసాలా చిత్రం ఇస్మార్ట్ శంకర్ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ ముగ్గురికి కమ్ బ్యాక్ లా పనిచేసింది. ఎప్పటి నుండో మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ కీ, హిట్లు లేక అవస్థలు పడుతున్న పూరీకీ, ఫేడ్ అవుట్ అయిపోయాడని వార్తలు వచ్చిన మణిశర్మలకి మంచి ఎనర్జీ ఇచ్చింది.

 

అయితే ఈ సినిమా అనంతరం విజయ్ దేవరకొండతో సినిమా స్టార్ట్ చేశాడు. లాక్డౌన్ కి ముందు వరకూ ముంబైలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఫైటింగ్ నేపథ్యంలో ఉంటుందట. అమ్మ సెంటిమెంట్ తో పాటు రింగ్ లో ఫైట్ చేసే ఫైటర్ లా విజయ్ కనిపించనున్నాడు. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

 

విజయ్ కెరీర్లో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న మొట్టమొదటి చిత్రం ఇది. అందుకని పూరి జగన్నాథ్ ఈ కథని అక్కడి జనాలకి కూడా సరిపడేలా యూనిక్ గా తీర్చిదిద్దాడట. ఇకపోతే చిత్ర టైటిల్ విషయమై ఇంకా ఏదీ కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతానికి ఫైటర్ అనే పిలుచుకుంటున్నప్పటికీ అది ఒరిజినల్ టైటిల్ కాదట. వర్కింగ్ టైటిల్ గా మాత్రమే పిలవబడుతుందట.

 

అసలైన టైటిల్ ని ఆల్రెడీ రిజిస్టర్ చేసి పెట్టారట. ఏదైనా మంచి సందర్భం చూసి టైటిల్ ని అనౌన్స్ చేస్తామని అంటున్నారు. ఇప్పటికే నలభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్ర టైటిల్ ఏ విధంగా ఉండనుందనే ఆసక్తి మొదలైంది. పూరి సినిమాలకి చాలా భిన్నమైన టైటిల్స్ పెడుతుంటాడు. మరి పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఎలాంటి టైటిల్ ప్లాన్ చేసి పెట్టుకున్నాడో..!

మరింత సమాచారం తెలుసుకోండి: