పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు విజయవంతం కాకపోయినా... రాజకీయాల్లో తాను అట్టర్ ఫ్లాప్ అయినా... ఇప్పటికీ తనని దేవుడిలా పూజించే అభిమానులు మిలియన్ల సంఖ్యలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఇతను సినిమా ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చి మూడు సినిమాలలో నటిస్తుండగా... అతడి అభిమానులంతా షూటింగులో ఎప్పుడు పూర్తవుతాయని వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు. అతని కెరీర్ లో హిట్ అయిన అన్ని సినిమాలు రీమేకులే కావడం విశేషం. 


తన మొట్టమొదటి సినిమా అయిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కూడా హిందీలో బ్లాక్ బస్టర్ హిట్టయిన ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాకి రీమేక్ కాగా... ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాని మన తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందించారు. అయితే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారన్నది చాలా మందికి తెలియక పోవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ మూవీ చిత్రీకరణ పూర్తి అయ్యే వరకు నెలకు ఐదు వేల రూపాయలను తీసుకున్నారట. ఈ సినిమా షూటింగ్ దాదాపు 9 నెలల వరకు జరిగిందని సమాచారం. దీన్నిబట్టి చూస్తే కేవలం 45 వేల రూపాయలకే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా లో పవన్ కళ్యాణ్ నటించాడని చెప్పుకోవచ్చు. ఈ సినిమా చిత్రీకరణ, కాస్ట్ అండ్ క్రూ పారితోషకాలు ఇవ్వడం మొత్తం కేవలం 60 లక్షల రూపాయలతో పూర్తయింది. 


ఇ.వి.వి సత్యనారాయణ అప్పట్లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ప్రచారం చేసేందుకు వినూత్నమైన రీతిలో ఆలోచించాడు. పవన్ కళ్యాణ్ పోస్టర్ రాష్ట్ర వ్యాప్తంగా అంటించి... ఈ అబ్బాయి ఎవరో చెప్పుకోండి అంటూ ప్రజల్లో ఆసక్తిని రేపాయి. కొన్ని రోజుల తర్వాత ఈ అబ్బాయి మన వాడే మన చిరంజీవి తమ్ముడు అనే పోస్టరు ప్రచురించి రాష్ట్రవ్యాప్తంగా అంటించి పవన్ కళ్యాణ్ సినిమా ని చాలా తెలివిగా ప్రచారం చేశాడు. ఏది ఏమైనా మొదటిలో 50 వేల రూపాయలు తీసుకొన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు 50 కోట్ల రూపాయలను అందుకోవడం గొప్ప విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: