మన తెలుగులో చాలా మంది స్టార్ హీరోలకు తాము స్టార్ హీరోలం కథా అనే పొగరు ఉంటుంది అని అంటూ ఉంటారు. చిన్న దర్శకులతో సినిమాలు చేయడం నామోషి గా భావిస్తూ ఉంటారు. ఫ్లాప్ అయిన దర్శకులతో సినిమాలు చెయ్యాలి అంటే ఒకటికి వంద సార్లు ఆలోచన చేసి చేస్తూ ఉంటారని చెప్తారు. కాని టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అలాంటి పరిస్థితి ఏ విధంగా చూసినా సరే ఉండదు అనేది టాలీవుడ్ జనాల మాట. అతని తో సినిమా చెయ్యాలి అంటే ఏ దర్శకుడు అయినా చేయవచ్చు అని ఏ దర్శకుడి తో అయినా సరే అతను సినిమా చేయడానికి రెడీ అని అంటారు. 

 

కథ ఏ విధంగా ఉన్నా సరే తనకు నచింది ప్రేక్షకులు ఆదరిస్తారు అంటే అతను సినిమా చేయడానికి ఏ మాత్రం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు అని అంటారు. ఏ సినిమా దర్శకుడు అయినా సినిమా కష్టపడి హిట్ అవ్వడానికే ప్రయత్నం చేస్తాడని అవకాశం ఉంటే ప్రతిభ ఉన్న వాళ్లకు అవకాశం ఇస్తే తప్పు లేదు అనేది తారక్ భావన అని అంటారు. అతను అందుకే చాలా మంది దర్శక నిర్మాతలకు వాళ్ళు కెరీర్ లో ఫ్లాప్ అయినా సరే అవకాశాలు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. 

 

అగ్ర హీరో అనే హోదా లో కాకుండా ఒక నటుడి హోదాలో ఆలోచిస్తే ఎవరి తో అయినా ఏ సినిమా అయినా చేయవచ్చు అనేది తారక్ అభిప్రాయం అందుకే అతను సినిమాకు ప్రాణం పెట్టి చేస్తూ ఉంటాడు అని అంటారు. ప్రస్తుతం తారక్ కెరీర్ లో బిగ్గెస్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు అతను చాలా వరకు కష్టపడుతున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: