విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు.. తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరుకు ఎలాంటి విలువ‌లు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.  సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఈ పేరు తలవని రోజంటూ లేదంటే అతిశయోక్తి కాదేమో. అంతలా ప్రభావితం చేసిన పేరు ఎన్టీఆర్. నటుడిగా, స్క్రిప్ట్ రైటర్ గా, నిర్మాతగా, దర్శకుడిగా, స్థూడియో వ్యవస్థాపకుడిగా, థియేటర్ల యజమానిగా సినీమాధ్యమాన్ని తలకెత్తుకుని పురోగమించారు. అటువంటి గొప్ప వ్య‌క్తి మ‌న‌వ‌డిగా ఎంట్రీ ఇచ్చాడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌.  

IHG

అలాంటి కుటుంబం నుంచి నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడంటే అతని ప్రయాణం నల్లేరుపై నడకే అనుకోవచ్చు కాని..  నందమూరి అనే బ్యాగ్రౌండ్ ఎన్టీఆర్‌కు టైటిల్ కార్డ్‌గా మాత్రమే ఉపయోగపడింది. అవును! సినీ కెరీర్‌లో ఎన్టీఆర్  చూసిన ఒడిదుడుకులు ఎవరు చూసి ఉండరు. అయిన వాళ్లు అందరూ ఉన్నా ఒంటగిగానే బ్రతికాడు. 17 ఏళ్లకు హీరోగా ఎంట్రీ, 19 ఏళ్లకు మాస్ హీరోగా మారాడు. తన నటనతో, తన వాక్చాతుర్యంతో కోట్లమంది అభిమానులను సంపాదించున్నారు. అందరూ దూరమైన, అభిమానులే అతని అండ అనుకుని ముందుకు సాగాడు.

IHG

కష్టం, కఠోర శ్రమకు కేరాఫ్ అయిన‌ ఎన్టీఆర్ ఈరోజు అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరిగా ఉన్నారంటే ఒకప్పుడు ఒకరిగా పోరాటం చేసినందుకే అన‌డంలో సందేహం లేదు. ఇక మొట్ట‌మొద‌ట తారక్ లోని కళాభిమానానికి ముగ్ధులైన సీనియర్ ఎన్టీఆర్ 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాలో లో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. ఆ త‌ర్వాత 2001లో పూర్తి స్థాయి హీరోగా `నిన్ను చూడాలని` సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత ఎన్నో అవమానాలు, మరెన్నో అడ్డ‌కుంలు ఎదురైనా.. ఏ మాత్రం కుంగిపోకుండా, వెనుక‌డుగు వేయ‌కుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ వ‌చ్చాడు.

IHG

ఈ క్ర‌మంలోనే నటుడిగా సీనియ‌ర్ ఎన్టీఆర్‌కి అసలు సిసలు వారసుడు, నంద‌మూరి వంశంలోనే తాతకు తగ్గ మనవడు ఈ తారకరాముడే అని జనం నుంచి గళం వినిపించేలా చేశాడు. ఇక ఆ తాత పేరే తనది. అచ్చు గుద్దినట్లు తాత పోలికలూ తనవే. సినీ జగమెరిగిన ఆ తాతను ప్రతి భంగిమలోనూ ఆవహించుకుని... ఆ అవాహనే అదృష్టంగా పరిణమించి తెలుగు సినిమాలో తిరుగులేని ఈ తరం స్టార్ హీరోగా ఎదిగిన ఎన్టీఆర్‌ ప్రేక్ష‌కుల చేత రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు. మ‌రో విష‌యం ఏంటంటే.. అందరి హీరోలకు వారసత్వ బిరుదులు వచ్చాయి కానీ, జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రమే అభిమానులనుంచి బిరుదు వచ్చింది అదే యంగ్ టైగర్ ఎన్టీఆర్. అలాంటి ఈయ‌న నేడు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. ఇక త‌మ అభిమాన హీరో బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. 

 
  

  

మరింత సమాచారం తెలుసుకోండి: