జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయి. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా అతని కెరీర్ లో కొన్ని సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా రాఖీ. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు ముందు జూనియర్ ఎన్టీఆర్ అని అంటున్నారు. ఆయన అభిమానులకు ఈ సినిమా చాలా చాలా బాగా నచ్చింది. ఆ సినిమాలో తారక్ నటన చూసిన సినీ విమర్శకులు అయితే అతని గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అనే విధంగా మాట్లాడారు. కెరీర్ లో ఆ సినిమా అతనికి ఫ్లాప్. 

 

కథలో పట్టు లేదు. అయినా సరే ఆ సినిమా ఇప్పటికి టీవీ లో వస్తే చూస్తూ ఉంటారు ప్రేక్షకులు.ఆ సినిమాలో అతని నటనకు ఫిదా అయిపోయారు జనాలు అనేది వాస్తవం. కోర్ట్ సీన్ లో అతని నటన చూసిన చాలా మంది అతని గురించి విమర్శలు చేయడం కూడా మానేశారు. ఇక అక్కడి నుంచి అతని తో సినిమా అనగానే నటనకు ప్రాధాన్యత ఉంటేనే చెయ్యాలి అని భావించే విధంగా అతను సినిమాలను చేసాడు టాలీవుడ్ లో ఆ సినిమా అతనికి నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వొచ్చు గాని అతనికి మాత్రం యెనలేని పేరు తీసుకొచ్చింది. 

 

అగ్ర హీరో అయితే ఇలాగే ఉండాలి ఇలాగే నటించాలి అనేది లేకుండా తనకు ఉన్న ఇమేజ్ ని పక్కన పెట్టి అతను సినిమా చేసాడు అనేది వాస్తవం. ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు ఇప్పటికి కూడా కళ్ళ ముందు ఉన్నాయి అనేది అర్ధమవుతుంది. అతని కెరీర్ కి ఆ సినిమా నటుడిగా మంచి ప్లస్ అయింది అని చెప్తారు ప్రేక్షకులు కూడా. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: