మన తెలుగు హీరోలు చాలా మందికి ఇతర భాషల్లో సినిమాలు చెయ్యాలి అనేది ముందు నుంచి కూడా ఒక ఆసక్తి. ఇతర భాషల్లో సినిమాలు చేసి హిట్ అయితే ఇక మన గురించి ఆలోచించుకునే పరిస్థితి ఉండదు అని భావించి వాళ్ళు ఎక్కువగా ఇతర భాషల మీద దృష్టి పెడుతూ ఉంటారు. కాని  మన తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అలా ఉండదు అనేది చాలా మంది భావన. టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు ఇతర భాషల్లో ఒక్క సినిమా చెయ్యాలి అనేది కోరిక గా ఉందని అతను మాత్రం టాలీవుడ్ లో మినహా ఇతర భాషల్లో సినిమాలు చేయడానికి అంతగా ఆసక్తి చూపించే అవకాశం ఉండదు అంటారు. 

 

మన ప్రేక్షకులు మనల్ని ఆదరిస్తున్న సమయంలో మన ప్రేక్షకుల కోసం మనం కొత్తగా చెయ్యాలి గాని ఇతర భాషల మీద ఫోకస్ చేసి మన వాళ్లకు అన్యాయ౦ చేయడం ఎంత వరకు భావ్యం అనే భావన లో అతను ఉంటాడు అని అందుకే ఇతర భాషల మీద ముందు నుంచి కూడా అతనికి అంత ఆసక్తి లేదని అవకాశాలు వచ్చినా సరే అతను ఎప్పుడు కూడా ఇతర భాషల్లో సినిమాలు చేయడానికి అంతగా ఆసక్తి చూపించలేదు అని అంటూ ఉంటారు టాలీవుడ్ జనాలు. ప్రస్తుతం మన తెలుగులో అతనికి మంచి క్రేజ్ ఉంది. అందుకే ఇక్కడే సినిమాలను చేస్తున్నాడు. 

 

వేరే భాషల  సినిమాలు చేసి అవి హిట్ అవ్వకపోతే తాను ఇబ్బంది పడి నిర్మాతలను ఇబ్బంది పెట్టి అంత సీన్ అవసరం లేదని తనకు తెలుగు చాలు అని అంటూ ఉంటాడు అని అంటారు. అందుకే వేరే భాషల్లో అవకాశాలు వచ్చినా సరే అతనికి అంత ఆసక్తి లేక వెనక్కు వచ్చేస్తాడు అని అంటారు ప్రేక్షకులు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: