తెలుగు ఇండస్ట్రీలో యంగ్ అండ్ రొమాంటిక్  జంట సమంత, నాగ చైతన్య. ఈ బ్యూటిఫుల్ కపుల్ అభిమానులను ఎల్లప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటారు. వీరిద్దరూ  " ఏం మాయ చేసావే " సినిమా షూటింగ్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలో భాగంగానే ఇద్దరు ప్రేమలో పడ్డారు. చివరకి ఇరువైపుల కుటుంబ సభ్యులను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంట తెలియచేసే సంగతులు అభిమానులకి మంచి కిక్ అందిస్తాయి. ఇక తాజాగా సమంత, మంచు లక్ష్మి నిర్వహించిన టాక్ షోలో... సమంత మాట్లాడుతూ నాగచైతన్య మొదటి భార్యతో నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను అంటూ తెలియజేయడం జరిగింది. దీనితో అభిమానులు అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు అనే చెప్పాలి. 


ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... ఆ టాక్ షోలో మంచు లక్ష్మి సమంతను ఉద్దేశిస్తూ... నువ్వు సింగిల్ గా ఉన్నప్పుడు లేదా వ్యక్తితో కలిసి ఉన్నప్పుడు.. నువ్వు ఫీల్ అయ్యే మూడు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తెలియ చేయాలంటూ కోరడం జరిగింది. దీనిలో భాగంగానే సమంత స్పందిస్తూ... నాగ చైతన్య మొదటి భార్య.. మా ఇద్దరి మధ్య అడ్డుగోడ లాగా ఉంటుంది అని తెలియజేసింది.

IHG

 

చైతుకి బెడ్ రూమ్ లో పిల్లో మొదటి భార్య. చైతన్యకు ముద్దు పెట్టాలనుకున్నప్పుడల్లా బెడ్ రూమ్ లో పిల్లో అడ్డు పడుతుంది అని తెలియజేసింది. ఇలా బెడ్ రూమ్ సీక్రెట్స్ ని ప్రేక్షకులకు బయటకు తెలియచేసింది. ఇక సమంత చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వీరిద్దరు పెళ్లి తర్వాత కూడా ఎవరికి వారు సినిమాలు చేస్తూ లైఫ్ ను హ్యాపీ గా కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా కొన్ని వ్యాపార ప్రకటనలలో కూడా వీరిద్దరూ కూడా కలిసి నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: