యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు తన 37వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సెలబ్రెటీలు  అలాగే ఫ్యాన్స్ ఎన్టీఆర్ కు విషెస్ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో ఎన్టీఆర్ బర్త్ డే కు సంబందించిన  హాష్ టాగ్ లు ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి.  కాగా టాలీవుడ్ నుండి పెద్ద ఎత్తున ఎన్టీఆర్ కు విషెస్ తెలియజేస్తున్నారు. అందులో భాగంగా మెగాస్టర్ చిరంజీవి, రాఘవేంద్ర రావు, కళ్యాణ్ రామ్ ,సాయి ధరమ్ తేజ్ తదితరులు ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ ను విష్ చేశారు.  
 
 
ఇక ఇప్పటివరకు 28 సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ టెంపర్ నుండి అపజయమే లేకుండా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ చిత్రం తరువాత త్రివిక్రమ్ తో తన 30వ సినిమా చేయనున్నాడు. ఈరెండు సినిమాల పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: