ఈరోజు అనగా మే 20వ తేదీన రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కి 36 సంవత్సరాల నిండి 37 ఏళ్లు వచ్చాయి. ఐతే తన పుట్టిన రోజుకి ఒక రోజు ముందు రాత్రి మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ లో..." నాకు ఊహ తెలిసినప్పటి నుండి నా పుట్టినరోజు ని బంధుమిత్రుల సమక్షంలో చాలా గ్రాండ్ గా జరుపుకునే వాళ్ళం. కానీ ఈ రోజున నా అన్నదమ్ములు, అమ్మానాన్నలు, ఆత్మీయులు అడుగు దూరంలో ఉన్నా... వారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకోలేని పరిస్థితి. నాతోటి భారతీయులందరూ కరోనా మహమ్మారి కారణంగా ఎంతో బాధ పడుతుంటే ప్రశాంతంగా ఒక్క ముద్ద కూడా తినాలనిపించట్లేదు. ఇక నా పుట్టినరోజు వేడుకలను ఎలా జరుపుకోగలను? ఈ సంవత్సరం ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేయడమే నా బర్త్ డే సెలబ్రేషన్స్ కావాలని నేను కోరుకుంటున్నాను" అని పేర్కొన్నాడు మంచు మనోజ్. 


అలాగే తన లేఖలో... పరాయి రాష్ట్రంలో చిక్కుకుపోయిన వలస కార్మికులకు చేయూతగా ఉండి వారిని తమ స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తానని ఆయన అన్నాడు. వలస కార్మికుల ఇంటికి చేరుకునేందుకు తాను చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని... అందుకు మీ అందరి దీవెనలు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చాలామంది కరోనా తో కలిసి జీవించక తప్పదు అని అంటున్నారు... వాళ్లందరూ ఆ విధంగా అన్నంత మాత్రాన మీరేం కంగారు పడకండి. మనం రోజువారి జీవితాల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము. వాటి ముందు కరోనా వైరస్ వట్టి బచ్చా... మనమందరం కరోనాపై సులువుగానే జయించగలము" అని అందరిలో తాను ధైర్యాన్ని నింపాడు. 

 


ఇకపోతే మంచు మనోజ్ మే 20వ తేదీన 1983 సంవత్సరంలో సీనియర్ హీరో మోహన్ బాబు, నిర్మలాదేవి లకు చెన్నైలో జన్మించాడు. తాను అమెరికాకి చెందిన సౌత్ ఈస్ట్రన్ ఓక్లహోమా స్టేట్ యూనివర్సిటీలో డిగ్రీ చదివాడు. తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో టాలీవుడ్ సినిమాలలో నటించాడు. 2004వ సంవత్సరంలో దొంగ దొంగది సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమైన మంచు మనోజ్ ఆ తర్వాత శ్రీ, రాజు భాయ్, నేను మీకు తెలుసా లాంటి మ్యూజికల్ హిట్ సినిమాల్లో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. బిందాస్ సినిమాలో ఇతని నటనకు గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. 2010వ సంవత్సరంలో వేదం సినిమాలో వివేక్ చక్రవర్తి అనే రాక్ స్టార్ పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఏది ఏమైనా మంచు మనోజ్ రీల్ హీరోగా కంటే రియల్ హీరో గా అనేక సందర్భాల్లో నిరూపించుకున్నాడు. ఇటువంటి మంచి మనసున్న హీరో పదికాలాలపాటు సంతోషంగా జీవించాలని... అతని పుట్టిన రోజు సందర్భంగా ఆశీర్వదిస్తున్నారు అభిమాన నెటిజనులు.

మరింత సమాచారం తెలుసుకోండి: