తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొందుతు నటనకు  ప్రతిరూపంగా ఉన్నారు  జూనియర్ ఎన్టీఆర్. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఫిదా అవని తెలుగు ప్రేక్షకుడు  లేడు అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకుంటారు. ఆ పాత్రలకు ప్రాణం పోస్తూ ఎంతో మంది ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఉంటారు జూనియర్ ఎన్టీఆర్. కేవలం నటనతోనే కాదు డాన్స్ పర్ఫార్మెన్స్ లతో  అదరగొడితూ  ఉంటారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రం ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంటుంది. 

 

 అటు నందమూరి ఫ్యామిలీ లో కూడా అంతే.. నందమూరి ఫ్యామిలీలో హీరోలు ఎంత మంది ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రం ఒక ప్రత్యేకమైన గుర్తింపు. కారణం తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తాతకు తగ్గ మనవడిగా నిరూపించుకుని... తెలుగు ప్రేక్షకులు  అందరూ తాతను మనవడిలో చూసుకునే విధంగా నటనతో ఆకట్టుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ లో ఎందుకు అంత స్పెషల్ అంటే.. చిన్నప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ తాత పోలికలు కలిగి ఉన్నాడు. తాత  సీనియర్ ఎన్టీఆర్ చరిస్మా పుట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ ముఖ కవళికలు.. నటన గాని అచ్చం తాత ని పోలి ఉంటుంది. 

 


 అందుకే జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా తెలుగు ప్రేక్షకులందరికీ ఫేవరేట్ గా  మారిపోయాడు. అటు సీనియర్ ఎన్టీఆర్ కూడా మనవడు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ప్రేమ. అంతేకాకుండా తాత దూరమైనా అదే  పేరుతో మరో నందమూరి తారక రామారావు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండడంతో ప్రేక్షకులు  జూనియర్ ఎన్టీఆర్ ను మరింత ఆరాధిస్తున్నారు. తాతగారి ఛరిష్మాతో  పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన పోలికలను కలిగి ఉండటం...  ఆయన పేరు పెట్టుకోవడం కూడా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి  కుటుంబంలో ఎప్పుడు స్పెషల్ గా ఉండేలా చేసింది అనడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: