ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కెరీయర్ పరంగా  దూసుకుపోతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు . ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కున్న ఇమేజ్ మాత్రం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల అందరిలో నటనకు నిలువెత్తు రూపంగా ప్రేక్షకులకు ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్కు తాత  సీనియర్ ఎన్టీఆర్ పై అమితమైన అభిమానం గౌరవం అన్న  విషయం తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ గురించి ఏదైనా మాట్లాడాలి అంటే ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు జూనియర్ ఎన్టీఆర్. 

 


 అయితే ఓ సందర్భంలో తాత తనకు పునర్జన్మనిచ్చాడు అంటూ ఆసక్తికర సన్నివేశాన్ని ప్రేక్షకులకు తెలిపాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇలియానా హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం శక్తి . ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయినా విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ మంచుకొండల్లో జరుగుతూ ఉంటుంది. మంచు కొండల  ప్రాంతంలో ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో.. ప్రమాదవశాత్తు జారిపడి  మంచులో కప్పబడి పోయి ఎవరికీ కనిపించకుండా అయిపోయానని... మంచు  మొత్తం తను కప్పేసింది అంటూ చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్. అయితే అప్పుడు పూర్తిగా ఊపిరి ఆగిపోయింది చనిపోతున్నాను అని అనుకుంటున్న తరుణంలో... ఒక్క సారిగా ఊపిరి వచ్చి  ఉలిక్కిపడి లేచాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. 

 


 నిజంగా అప్పుడు తనకి ఊపిరి అందించి ప్రాణాలను పోసింది తాతగారే  అని అనిపించింది అంటూ జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.  కొన ఊపిరితో ఉన్న తాను  తాత ఆశీస్సులతోనే బతికి బయటపడ గలిగాను అంటూ చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్. తాత గారి ఆశీస్సుల తో ఏదో శక్తి  తనను కాపాడిందని  లేకపోతే ఈ పాటికీ  జూనియర్ ఎన్టీఆర్ మీ ముందు  ఉండేవారు కాదు అంటూ చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో తాత గురించి ఎంత గొప్పగా చెప్పిన విషయం తెలిసిందే. తాత నటన విషయంలో ఇంత డెడికేషన్ తో ఉండే వారు అనే విషయాలు కూడా పలుమార్లు అభిమానులతో పంచుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: