నందమూరి తారక రామారావు.. ఆయననొక  కారణజన్ముడు.. తెలుగు చిత్ర పరిశ్రమను ఎన్నో ఏళ్ల పాటు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన గొప్ప నటుడు. అయితే అదే పేరుతో మరో హీరో నందమూరి ఫ్యామిలీ నుంచి తెర మీదికి వచ్చారు. ఆయనే జూనియర్ నందమూరి తారక రామారావు. తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా ఎంట్రీ  ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తాత సీనియర్  ఎన్టీఆర్ కు అసలు సిసలైన వారసుడిగా పేరు తెచ్చుకుని నందమూరి ఫ్యామిలీలో తాతకు తప్ప ఎవరికీ సాధ్యం కానంత గుర్తింపుని తెచ్చుకున్నారు. ఇక నటనలో డాన్సులతో ప్రేక్షకులను సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. 

 

 దీంతో సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా  మారిపోయాయి. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ విషయానికి వస్తే... ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటనకు  నిలువెత్తు రూపం అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమా నుంచి మొన్నటి అరవింద సమేత సినిమా వరకూ.. ప్రతి సినిమాలో తన వైవిధ్యమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి మరిపింప చేశాడు జూనియర్ ఎన్టీఆర్. 

 


 ఏదైనా పాత్ర జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నారు అంటే అది కేవలం జూనియర్ ఎన్టీఆర్ కోసం మాత్రమే సృష్టించబడిన పాత్ర అనేంతలా ఆ పాత్ర ను ప్రభావితం చేస్తూ ఉంటారు  జూనియర్ ఎన్టీఆర్. అందుకే టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ నటనకు నిలువెత్తు రూపం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అంటుంటారు సినీ ప్రేక్షకులు. అటు ఎంతో మంది హీరోలు కూడా జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే ఎంతో ఇష్ట పడుతూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ చేసిన నటన  కేవలం పైనకి కనిపించేది కాదని.. ప్రతి పాత్రకి ప్రాణం పోసే విధంగా జూనియర్ ఎన్టీఆర్ నటన ఉంటుందని హీరోలు సైతం ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అందుకే ఎంత మంది హీరోలు జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకులకు ఎప్పుడు ఫేవరెట్గా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: