జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల జాబితాలో వెలుగొందుతున్నాడు. అంతే కాదు టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అనడంలో కూడా అతిశయోక్తి లేదు.  నందమూరి వారసుడిగా  ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం ఎన్నో ఏళ్ళు గడిచి పోతుంది... అయితే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో నందమూరి అనే బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ అది సినీ పరిశ్రమకు పరిచయం అయ్యేంతతవరకు మాత్రమే పనిచేసింది... ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో తన డాన్సులతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోగా ఎదిగాడు. స్టార్ హీరోగా ఎదిగేంత  వరకూ నందమూరి బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఎన్టీఆర్కు తక్కువగానే పనికొచ్చింది అని చెప్పాలి

 

కాగా మామూలుగా అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమా లో భారీ డైలాగులు చెబుతూ అద్భుతంగా ప్రేక్షకులను మైమరపింపచేస్తూ ఉంటారు. ఇక బయట కూడా తన వాక్చాతుర్యంతో తన ఆటిట్యూడ్తో ఆకట్టుకుంటాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి రాజకీయ పరిజ్ఞానం కూడా ఎంతగానో ఉంది. ఇప్పటికే సినిమాల్లో తాతకు తగ్గ మనవడిగా నిరూపించుకున్న  జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళిన అంతకుమించి నిరూపించుకోగలడు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కి రాజకీయాలపై పట్టు ఉంది.. ఏ సందర్భంలో ఎలాంటి సబ్జెక్టు మాట్లాడాలి  అన్న విషయంలో క్లారిటీ ఉంది... అంతేకాకుండా తన వాక్చాతుర్యంతో ముఖ్యంగా ప్రజలను  ఆకట్టుకునే పటిమ ఉంది.

 


 ముఖ్యంగా ఓ సారి ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ ని బరిలోకి దింపారు చంద్రబాబు నాయుడు. జూనియర్ ఎన్టీఆర్ తో  ప్రచారం చేయించారు.. అప్పుడే జూనియర్ ఎన్టీఆర్ వాక్చాతుర్యానికి... రాజకీయం అనే సబ్జెక్టుపై జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న పట్టుకి అందరు మైమరిచి  పోయారు. అంతేకాదు గత కొన్ని రోజులుగా అటు టిడిపి పార్టీ పగ్గాలు చేపట్టేది చంద్రబాబు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అని  బాగా  బలంగా వినిపిస్తోంది. పార్టీకి పూర్వ వైభవం రావాలంటే  జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి పార్టీ పగ్గాలు  రావాల్సిందే అని గతంలో కూడా వార్తలు వచ్చాయి. కాగా గతంలో టిడిపి తరఫున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాల జోలికి వెళ్ళలేదు ఎక్కడా కనిపించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: