ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌‌.. ఈ పేరుకు యూత్‌లో ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు ప్ర‌త్యేకంగా లెక్క‌లు అక్క‌ర్లేదు.  తెలుగు సినీ పరిశ్రమలో ఈయనకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ మరో హీరోకి లేదు అంటే అతిశ‌యోక్తి కాదు. దేశవ్యాప్తంగానే కాదు ఈయనకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారు అన్న‌ది వాస్త‌వం. ఇక పవన్ సినిమాకు హిట్ టాక్ వచ్చినా ఫ్లాప్ టాక్ వచ్చినా కలెక్షన్స్ లో కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. పవన్ తొలి రోజు రికార్డులు అందుకోవడం ఇతర హీరోలకు అంత సులభం కాదంటారు ఆయన అభిమానులు. అయితే కెరీర్లో ఇప్పటి వరకు 25 చిత్రాల్లో నటించిన పవర్ స్టార్ అటు రాజకీయాల్లో కూడా అడుగుపెట్టాడు.

 

దీంతో పవర్ స్టార్ కొందరికి నటుడుగా తెలుసు కొందరికి రాజకీయ నాయకుడిగా తెలుసు, కొందరికి జనసైనికుడిగా తెలుసు మరి కొందరికి విప్లకారుడిగా తెలుసు. వాస్త‌వానికి తమిళ సూపర్ స్టార్ రజిని కాంత్ తరువాత అంతా సింపుల్ గా జీవనం సాగించే ఏకైక నటుడు పవన్ కళ్యాణ్. అలాంటి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినీ ప్ర‌స్థానం `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` సినిమాతో హీరోగా పరిచయమై తనదైన మేనరిజం తో పవర్ స్టార్ గా మారిపోయాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ తర్వాత వరుసగా ఆరు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. దాంతో పవన్ కల్యాన్ అందరి హీరోలన్న ఎక్కువ పాలోంగ్ సంపాధించుకున్నారు.

 

అయితే ప్రస్తుతం కోట్ల‌లో పారితోషికం అందుకుంటున్న పవన్ కళ్యాణ్ తన మొదటి సినిమాకు ఎంత అందుకున్నాడో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు.  ఈవీవీ సత్యనారాయణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు  అల్లు అరవింద్ నిర్మాతగా వ్య‌వ‌హ‌రించారు. ఇక ఈ సినిమా మొదటిది కావడంతో పవన్ కళ్యాణ్ కు చాలా తక్కువ పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. అల్లు అరవింద్ నెలకు 5 వేల రూపాయలు చొప్పున పవన్ కు ఇచ్చార‌ట. ఈ విషయం అప్పట్లో పవన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సొంత నిర్మాణ సంస్థ కావడంతో అలా ఇచ్చుంటాడంటారు విశ్లేషకులు. అదే ఇప్పుడు పవన్‌తో సినిమా చేయాలంటే కనీసం 50 కోట్లు ఇవ్వాల్సిందే. అలా మొదటి సినిమాతో 5 వేల రూపాయల నుండి ప్రస్తుతం 50 కోట్ల వరకూ పవన్ ప్రయాణం చాలా గమ్మత్తుగా సాగింద‌నే చెప్పాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: