ఎవరైనా కొన్ని పాటలు వింటే మ్యూజిక్ ఎలా ఉంది, అందులో హీరో హీరోయిన్లు ఎలా నటించారు అనే వాటి గురించి చాలామంది ఆలోచిస్తారు. కానీ అదే సమయంలో ఆ పాట ఎవరు రచించారు ...? ఆ పాట అర్థం తెలుసుకోవాలని ప్రయత్నం చేసే వారు కూడా ఉంటారు. కానీ అలాంటి పాటలను రచించి, మన పెదాలపై పలికే విధంగా ఉండే భావయుక్తమైన పదాలన్నీ ఒకే చోటకు తీసుకువచ్చి ఒక పాటగా దాన్ని మలచడం అంటే అది కేవలం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి మాత్రమే చెందుతుంది. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా మనము ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం...


సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 36 సంవత్సరాల క్రితం తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఒక సమస్యను ఎదుర్కొంటూ వాటిని పాట ద్వారా ప్రేరేపించే గల శక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి మాత్రమే చెందుతుంది. తెలుగులో నేపథ్య గాయకులు రచయితలు ఎవరు అంటే ముందుగా చెప్పిన వరుసలో ఆత్రేయ, వేటూరి తరువాత సీతారామ వెన్నెల గరే అని చెప్పాలి. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో బీకాం పూర్తి చేసిన తర్వాత 1984వ సంవత్సరంలో సినిమా సాహిత్యం వైపు మొదటి అడుగు వేశారు. ఆయన 1984వ సంవత్సరంలోనే జననీ జన్మభూమి అనే సినిమాకి తన మొదటి పాటను అందించారు.  

 

నిజానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అసలు పేరు చెంబోలు సీతారామశాస్త్రి అయితే సీతారామశాస్త్రి నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా మారడానికి కారణం సిరివెన్నెల సినిమాలో రాసిన పాటలు అలా మార్చేశాయి. ఇక ఆ సినిమా తర్వాత ఆయన్ను ఇండస్ట్రీలో తిరుగులేని స్థానంలో నిలిపాయి. సిరివెన్నెల సినిమాలో ఆయన రాసిన ప్రతీ పాట ఒక ఆణిముత్యం అని చెప్పవచ్చు. ఇంతటి కళా తపస్వి అయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఏకంగా ఇంతవరకు 11 నంది అవార్డులను, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సాధించారు. 1986, 87, 88 సంవత్సరాల్లో వరుసగా మూడుసార్లు నంది అవార్డులు గెలుచుకున్న ఆయన హ్యాట్రిక్ సాధించారు. ప్రస్తుతం ఉన్న అనేకమంది పాటల రచయితలకు కూడా సిరివెన్నెల శాస్త్రి గారు ఒక గురువుగా భావిస్తారు. తన 35 సంవత్సరాల సినీ ప్రస్థానానికి పురస్కరించుకొని ఆయనకు పద్మశ్రీ అవార్డును అందజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: