టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లో దగ్గుబాటి రానా మొదటి వరుసలో ఉంటాడు. బ్యాచిలర్ గా ఉన్న రానా పెళ్లెప్పుడు అంటూ వస్తున్న వార్తలకు ఇటివల చెక్ పెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్ కి చెందిన మిహికా బజాజ్ ను ప్రేమించిన విషయం.. ఆమె తన ప్రేమను అంగీకరించిన విషయాన్ని ఇటివలే రివీల్ చేశాడు. వీరి ప్రేమకు అంగీకారం తెలిపిన ఇరువైపు పెద్దలు వీరిద్దరి ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు చేశారని తాజా సమాచారం. ఇందుకు ముహూర్తం కూడా సిద్ధమైందని తెలుస్తోంది.

 

 

ఈ రోజు సాయంత్రం రామానాయుడు స్టూడియోస్ లో సాయంత్రం 4గంటలకు రానా – మిహికా బజాజ్ ల ఎంగేజ్ మెంట్ జరుగబోతోందని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ఏర్పాట్టు కూడా జరుగుతున్నాయని సమాచారం. ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో బంధు, మిత్రులు హాజరవుతున్నారని అంటున్నారు. వీరి ప్రేమ గురించి రానా తండ్రి దగ్గుబాటి సురేశ్ కూడా ఇటివలే స్పందించిన విషయం తెలిసిందే. రానా – మిహికాల పెళ్లి ఈ ఏడాది డిసెంబర్ నెలలోనే ఉండొచ్చని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ఈరోజు జరుగుతోందని తెలుస్తోంది.

 

 

హైదరాబాద్ కు చెందిన మిహికా చెల్సియా యూనివర్శిటీ నుంచి ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ చేసింది. ప్రస్తుతం ముంబయిలో వీరి వ్యాపారాలు కొనసాగుతున్నాయి. డ్యూ డ్రాప్ స్టూడియోను నిర్వహిస్తోంది. తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. బాహుబలితో స్టార్ క్రేజ్ కూడా తెచ్చుకున్నాడు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పదేళ్లలో హీరోగా, విలన్ గా విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించాడు. రానా ప్రేమ విషయం తెలియగానే టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షల వెల్లువెత్తాయి. ఈ ఎంగేజ్ మెంట్ కు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరవుతారని సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: