టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తైన ఈ సినిమా షూటింగ్ కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. నిజానికి పరిస్థితులు సవ్యంగా ఉన్నట్టైతే పుష్ప షూటింగ్ బ్యాంకాక్, కేరళ అడవుల్లో జరగాల్సి ఉంది. కానీ.. ప్రస్తుత నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ను చిత్తూరు ప్రాంతంలోని శేషాచలం అడవుల్లో ప్లాన్ చేశారు. అయితే.. అక్కడ కూడా కాదని నెక్స్ట్ షెడ్యూల్ ను తూర్పు గోదావరి ప్రాంతంలోని రంపచోడవరం ఫారెస్ట్ లో షూటింగ్ ప్లాన్ చేశారు.

 

 

అయితే.. లాక్ డౌన్ పరిస్థితులు ఎప్పుడు పూర్తవుతాయో.. ప్రభుత్వ అనుమతులు ఎప్పుడొస్తాయో తెలీని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు పుష్ప టీమ్ కు ఏపీ గవర్నమెంట్ తీపి కబురు అందించింది. సినిమా షూటింగ్స్ కు అనుమతి ఇవ్వడం వారికి మంచి అవకాశమనే చెప్పాలి. మరి ఈ అవకాశాన్ని పుష్ప టీమ్ ఉపయోగించుకుంటే షూటింగ్ కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలుపెడితే షూటింగ్ వేగంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పరికరాలు, టీమ్, నటీనటులు ఇప్పుడు షూటింగ్ కు బయలుదేరాల్సి ఉంటుంది. రంపచోడవరంలో భారీ షెడ్యూల్ కు టీమ్ ప్లాన్ చేసినట్టు సమాచారం.

 

 

తూర్పు గోదావరి అడవుల్లో కూడా మంచి లొకేషన్లు ఉన్నాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతంతో కలిపి ఉన్న ఈ ప్రాంతంలో గోదావరి అందాలు, దట్టమైన అడవులకు కొదవ లేదు. కాబట్టి ఈ లొకేషన్ పుష్పకు ఉపయోగపడుతుందనే చెప్పాలి. సుకుమార్ కూడా రంగస్థలం సినిమాను గోదావరి అందాల మధ్యే చిత్రీకరించిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: