టాలీవుడ్ లోకి కెరటం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్.  ఇక సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మూవీ మంచి విజయాన్ని అందించింది.  ఆ మూవీతో తెలుగు లో వరుస ఛాన్స్ లు కొట్టేసింది. సినీ పరిశ్రమలో ఉన్న లాజిక్ బాగా అర్థం చేసుకుంది రకుల్. ఇక్కడ ఏం చేస్తే అవకాశాలు వస్తాయనేది రకుల్‌కు బాగా తెలుసు.. అందుకే ఇన్నేళ్లైనా కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా ఆఫర్స్ అందుకుంటుంది రకుల్.   అయితే హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఈ అమ్మడు బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టింది. గతంలో రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసింది. గతంలో తన కెరీర్ ఆరంభంలో చాలా అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయని బాధ పడింది రకుల్. అయితే తాను చేయాల్సిన సినిమాలు ఇతర హీరోయిన్లు చేసినా కూడా చాలా వరకు అవి ఫ్లాప్ అయ్యాయని చెప్పుకొచ్చింది.  

 

ప్రస్తుతం కరోనా వల్ల ఆర్థిక రంగం ఏ విధంగా తలకిందులైందో తెలిసిందే. ముఖ్యంగా దీని ప్రభావం సినీ రంగంపై పడింది. కరోనా ధాటికి సినీ పరిశ్రమ తీవ్రంగా కుదేలైంది. పూర్తిగా ఆగిపోయిన సినీ పరిశ్రమను తిరిగి గాడిన పెట్టేందుకు సినీ పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారు.  ఈ నేపథ్యంలో హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో నిర్మాతలకు ఇబ్బంది కలగకూడదని  హీరోయిన్ తాప్సీ స్వచ్ఛందంగానే తన పారితోషికాన్ని తగ్గించింది.

 

ఆమె వెంట మరికొంత మంది నడిచేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ రకుల్ కూడా అదే బాటలో పయనించబోతున్నట్టు తెలుస్తోంది. ఇకపై తన పారితోషికాన్ని తగ్గించుకోవాలని రకుల్ నిర్ణయించుకుందట. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నాటి నుంచి `మన్మథుడు-2` వరకు రకుల్ ఒక్కో సినిమాకు రూ.కోటి రూపాయలు తీసుకునేదని టాక్. ఇకపై దానిలో 30 నుంచి 50 శాతం వరకు తగ్గించుకోవడానికి రకుల్ సిద్ధంగా ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: