టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ రోజు అభిమానులకు పండగరోజు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇర ప్రతీ సంవత్సరం ఎన్టీఆర్ జన్మదినాన్ని ఒక వేడుకలా జరుపుకోవడం ఆనవాయితీ. అయితే కరోనా ఎఫెక్ట్‌తో సోషల్ డిస్టెన్సింగ్ కారణంగా ఈ ఏడాది వేడుకలకు దూరంగా ఉందామని యన్టీఆర్ అభిమానులకు విజ్ఞప్తి చేయడంతో.. సైలెంట్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే.. నందమూరి నటవారసుడిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నారు. తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు. బాలనటుడిగా ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రంలో భరతుడి పాత్రలో కనిపించిన ఎన్టీఆర్.. ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వం వహించిన బాలా రామాయణం చిత్రంలో తనదైన నటనతో అభిమానులను అలరించారు.
2001లో నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస హిట్లతో దూసుకుపోయాడు. ఎన్టీఆర్ ఈరోజు అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరిగా ఉన్నారంటే.. దాని వెనక పడిన కష్టమే అని చెప్పుకోవాలి. అయితే నేడు ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఆయన రేర్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరి వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.