'బాహుబలి' తర్వాత ఎక్కడ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’ తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. గత ఏడాది ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అవగా మధ్యలో కొన్ని కారణాల వాళ్ళ బ్రేక్ పడుతూ పడుతూ సినిమా షూటింగ్ జరుగుతుండగా మధ్యలో కరోనా వైరస్ రావటంతో లాక్ డౌన్ ఎఫెక్ట్ కి అన్ని సినిమాల షూటింగ్ లతో పాటు ‘RRR’ షూటింగ్ కూడా ఆగిపోయింది. దీంతో ఇప్పటికే ఈ సినిమా ఈ ఏడాది జూన్ మాసంలో రిలీజ్ అవుతుందని స్టార్టింగ్ లో చెప్పిన సినిమా షూటింగ్ బ్రేక్ పడటం తో తరువాత వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

 

అయితే ఇప్పుడు లాక్ డౌన్ దెబ్బకి వచ్చే ఏడాది కాకుండా 2022 లో సినిమా రిలీజ్ అవుతుందని ఇండస్ట్రీ నుండి వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటో ఒకటి రిలీజ్ కావడంతో దాన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. ఇండస్ట్రీ నుండి అనేక మంది స్టార్ హీరోలు ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

ఇటువంటి సమయంలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ‘RRR’ సినిమాలో ముస్లిం వ్యక్తిగా పోలీస్ స్టేషన్ లో ఎన్టీఆర్ చేసే ఫైట్ సినిమాకే హైలెట్ అని తాజాగా ఇండస్ట్రీ నుండి ఒక వార్త బయటకు వచ్చింది. ఆ ఫైట్ సన్నివేశాన్ని అభిమానులకు మెంటల్ తెప్పించేలా, హై క్వాలిటీ తో, రోమాలు నిక్కబొడుచుకునే లా రాజమౌళి తనదైన శైలిలో తెరకెక్కించినట్లు ఇండస్ట్రీలో టాక్. ఇదిలా ఉండగా ఈ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'RRR’ సినిమాలో ఎన్టీఆర్ లుక్ రిలీజ్ చేస్తారని ఆశ పెట్టి సినిమా యూనిట్ సాంకేతిక లోపం వల్ల రిలీజ్ చేయలేమని చెప్పటంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ నిరుత్సాహంలో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: