నందమూరి నట వారసుడు... నటనకు నిలువెత్తు రూపం... నాట్యానికి నిలువుటద్దం అయిన  జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమై తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజికి ఎదగడం. సొంత టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక సినిమాల్లో తక్కువ వయసులోనే ఎక్కువ మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలలో మొదటి స్థానంలో ఉంటారు జూనియర్ ఎన్టీఆర్. స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత సింహాద్రి ఆది సినిమాలో ఎంతగానో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించి క్రేజ్ సంపాదించాడు జూనియర్ ఎన్టీఆర్. 

 


 ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు అభిమానులు ప్రేక్షకులు ఎన్టీఆర్ కి  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో సోషల్ మీడియా మొత్తం జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్ లో అయితే జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే  విషెస్ ట్రెండ్ గా మారిపోయి రికార్డులు సృష్టిస్తున్నాయి. మామూలుగానే అందరితో కలిసిమెలిసి ఆనందంగా సరదాగా గడుపుతూ ఉంటారు జూనియర్ ఎన్టీఆర్. 

 


 అందుకే అందరు హీరోలు నిర్మాతలు దర్శకులు స్పందిస్తూ జూనియర్ ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని  తమ్ముడు అంటూ పిలిచే సూపర్ స్టార్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.. జూనియర్ ఎన్టీఆర్ ఒక గొప్ప వ్యక్తి... నీకు ఎప్పుడూ మంచే జరగాలని కోరుకుంటున్నాను హ్యాపీ బర్తడే బ్రదర్ అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ట్విట్టర్లో అయితే జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే  విషెస్ ఒక రేంజ్ లో వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏకంగా తెం  మిలియన్  విషెస్ దాటిపోవడంతో  ట్విట్టర్ లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది ఎన్టీఆర్ బర్త్ డే.

మరింత సమాచారం తెలుసుకోండి: