తెలుగు చిత్ర పరిశ్రమలో  అతను సినిమాకు సంబంధించిన వ్యక్తి అనే దగ్గరి నుండి.. అతను సినిమాలకు గొప్పగా పాటలు అందిస్తాడు అనేంతలా  తెలుగు చిత్ర పరిశ్రమలో తన పాటలతో ప్రభావితం చేశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. పాటలకు నిలువెత్తు రూపం ఉంటే అది సిరివెన్నెల సీతారామశాస్త్రి లాగే ఉంటుందేమో అనిపించేంతలా తెలుగు చిత్ర పరిశ్రమలో తన పాట లతో  ప్రేక్షకులను ప్రభావితం చేసాడు. పాటలలో ప్రేమ తియ్యదనాన్ని చెప్పాలి అన్న.. అమ్మ గొప్పతనాన్ని వివరించాలన్న... కుటుంబ బంధాలని అందరికీ తెలిసేలా చేయాలి అన్న... అది తిరిగి వెన్నెల సీతారామ శాస్త్రి కె చెల్లింది అని చెప్పాలి.అద్భుతమైన పదాలతో పాటలను సమకూరుస్తూ.. గీత రచయితగా ఎంతో గుర్తింపు సంపాదించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. 

 

 ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప కళా తపస్వి అనడంలో అతిశయోక్తి లేదు. పాటలే సినిమాకు వెన్నుముక.. పాటలే సినిమాకు ప్రాణం పోస్తాయి అని నిరూపించిన గొప్ప గీత రచయిత సిరివెన్నల సీతారామ శాస్త్రి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన మాణిక్యాలఅంటే పాటలు ఎన్నో. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల నుంచి అద్భుతమైన గీత రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు  . ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాటలను అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. కళామతల్లికి నిలువెత్తు రూపం ఆయన. 

 


 ఏకంగా ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ఇచ్చి గౌరవించింది. అయితే ఎంతో మంది దర్శకులు తెరకెక్కించిన సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తనదైన లిరిక్స్ తో పాటలు రాసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి కి... ఇష్టమైన దర్శకులు ఎవరూ అంటే... బాపు,  కె.విశ్వనాధ్. సిరివెన్నెల సీతారామశాస్త్రి మొట్టమొదటగా కె.విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన  సినిమా ద్వారానే చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. దశాబ్దాలకు పైగా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: