టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ముందుగా 1984లో కె విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన జనని జన్మభూమి సినిమాలో పాటలు రాయడంతో తన సినిమా కెరీర్ ని ఆరంభించిన చెంబోలు సీతారామశాస్త్రి, ఆ తరువాత మరొక్కసారి విశ్వనాధ్ గారి దర్శకత్వంలో 1986లో వచ్చిన సిరివెన్నెల సినిమాలో అత్యద్భుతమైన పాటలు రాసి, అక్కడి నుండి సిరివెన్నెలను తన స్క్రీన్ నేమ్ గా మార్చుకున్నారు. ఆ సినిమాలో సిరివెన్నెల రాసిన పాటల గురించి చెప్పడం నిజంగా మాటనలవిగానిది అంటే, ఆయన ఆ పాటలకు ఎంత గొప్ప సాహిత్యాన్ని అందించారో అర్ధం చేసుకోవచ్చు. విధాత తలపున ప్రభవించినది పాటకు సిరివెన్నెల రాసిన లిరిక్స్ గురించి ఇప్పటికే ఎందరో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. 

 

అంతగొప్పగా హిందుత్వంలోని ఆమ్ అనే పదంతో పాటు వేదాలను గురించి ఆయన వర్ణించిన తీరు నిజంగా అనన్యసామాన్యం. అది మాత్రమే కాక దాదాపుగా ఆ సినిమాలోని సాంగ్స్ అన్ని కూడా ఎంతో గొప్ప సంచలనాన్ని సృష్టించాయి. సిరివెన్నెల సాహిత్యానికి కెవి మహదేవన్ సంగీతం నిజంగా ఆ పాటలకు ఎంతో గొప్ప మాధుర్యాన్ని అందించింది. ఆ తరువాత నుండి ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన సిరివెన్నెల సీతారామశాస్త్రి, దాదాపుగా ప్రతి పాటలోనూ తన యొక్క ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేసేవారు. ఆ తరువాత కూడా విశ్వనాధ్ గారి చాలా సినిమాలకు పాటలు రాసిన సిరివెన్నెల, ఆపై ఎందరో అప్పటి గొప్ప దర్శకుల సినిమాలకు పని చేసారు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు పాటలు రాసిన సిరివెన్నెల, మధ్యలో అక్కడక్కడా కొన్ని పాటలను కూడా ఆలపించి మంచి పేరు దక్కించుకొవడం జరిగింది. 

 

సిరివెన్నెల హార్ట్ ట‌చ్చింగ్ సాంగ్స్ లో బొమ్మ‌రిల్లులోని న‌మ్మ‌క త‌ప్ప‌ని నిజమైనా, ఎలా చెప్ప‌నులోని ఈ క్ష‌ణం ఒకే ఒక కోరిక, ‌ చ‌క్రం సినిమాలోని జ‌గ‌మంత కుటుంబం నాది వంటి పాటలు మనల్ని ఎంతో కదిలిస్తాయి. అలానే ప్రేమ, స్నేహం విలువ చాటి చెప్పిన సిరివెన్నెల పాట‌ల్లో మనసంతా నువ్వే సినిమాలోని నీ స్నేహం ఇక రాదు అని, నువ్వే నువ్వే సినిమాలోని నువ్వే నువ్వే కావాలంటోంది, ప్రియమైన నీకు లోని మ‌న‌సున ఉన్న‌ది చెప్పాల‌నున్నది, సంతోషం సినిమాలోని నే తొలిసారిగా క‌ల‌గ‌న్న‌ది, అలానే భ‌ద్ర సినిమాలోని ఓ మ‌న‌సా ఓ మ‌న‌సా సాంగ్స్ గురించి చెప్పుకోవాలి. వాటితో పాటు ఇటీవల అనేక సినిమాల్లో ఎన్నో గొప్ప సాంగ్స్ రాసిన సిరివెన్నెల నేడు తన 64వ జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఎందరో ప్రేక్షకులు అభిమానులతో పాటు సినిమా ప్రముఖులు కూడా ఆయనకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఆయన భవిష్యత్తులో మరిన్ని గొప్ప పాటలు రాయలాంటి కోరుకుంటూ విష్ చేస్తున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: