ఈరోజు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టిన రోజు వేడుకలను తన నివాసంలో జరుపుకున్నారు . ఈరోజు అయన బర్త్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముకు ఆయనకు సోషల్ మీడియా ద్వారా విష్ చేశారు. అయితే ఎన్టీఆర్ కి రామ్ చరణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది...నా ప్రియమైన సోదరుడు ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు..నేను నీకు రిటర్న్ గిఫ్ట్ బాకీ ఉన్నానని తెలుసు..నేను నీకు బెస్ట్ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను..నీకోసం లెక్కలేనన్ని సంబరాలు ఎదురు చూస్తున్నాయి..అంటూ ట్వీట్ చేశాడు.

 

అదేవిధంగా రాజమౌళి  ఎన్టీఆర్ సినిమా ‘స్టూడెంట్ నెం.1’ కి సంబందించిన ఓ స్పెషల్ ఫోటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా శ్రేయాస్ మీడియా వారు కూడా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల పై ఓ ఆసక్తికరమైన కవిత ను రాసి ట్వీట్ చేశారు. అదేంటంటే ..."కొదమ సింహాలు  ఆటవిడుపుకి  వచ్చినట్లు.. జోడు గుర్రాలు  జూలు దులిపినట్లు...అగ్నికణాలు..శ్వేతవర్ణమేలినట్లు..నిండుపున్నమిలు..భువికే దిగినట్లు..ఏమున్నారు..ఏమున్నారు..రా ..ఈ ఆంధ్రా అభిమాన..తారక " రామ " చరణ్ లు.." అంటూ పోస్ట్ చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

I am glad you were a part of my journey from the start! Happy birthday dear Tarak. I couldn't have found a better bheem :)

A post shared by SS Rajamouli (@ssrajamouli) on

 

 

అయితే ఈ ట్వీట్ కాస్త వైరల్ అయ్యింది .ఇదిలా ఉండగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్ ఎటువంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా అని  అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రాజమౌళి ఇప్పటికే ఎన్టీఆర్ బర్త్ డే రోజు ఆర్ఆర్ఆర్ కి సంబందించిన ఎన్టీఆర్ టీసర్ ను రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే అయితే ఆ టీసర్ లో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడో అని అభిమానులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: