టాలీవుడ్ యువ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు తన 36వ జన్మదినాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ముందుగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాలరామాయణం సినిమాతో బాలనటుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్, ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై వచ్చిన నిన్ను చూడాలని సినిమా ద్వారా తొలిసారిగా హీరోగా మారారు. ఆ తరువాత స్టూడెంట్ నెంబర్ వన్, సుబ్బు, ఆది, అల్లరి రాముడు, నాగ, సింహాద్రి ఇలా వరుసగా సినిమాలతో మంచి హీరోగా ప్రేక్షకులను తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లిన ఎన్టీఆర్, నేడు టాలీవుడ్ గర్వించదగ్గ స్టార్ హీరోల్లో ఒకరిగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. 

 

ఇకపోతే నేడు ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ప్రేక్షకులు, అభిమానులతో పాటు ఎందరో సినిమా ప్రముఖులు సైతం ఆయనకు తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విషెస్ తెలియచేస్తున్నారు. తన నటనతో పాటు అద్భుతమైన డైలాగ్స్, అలరించే డ్యాన్స్ మూమెంట్స్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకునే ఎన్టీఆర్, సింగర్ గా కూడా మంచి పేరు దక్కించుకున్నారు. తొలిసారిగా యమదొంగ సినిమాలోని ఓలమ్మి తిక్కరేగిందా సాంగ్ పాడిన ఎన్టీఆర్, ఆ తరువాత కంత్రి సినిమాలోని 123 నేనొక కంత్రి, అదుర్స్ సినిమాలోని చారి సాంగ్, రభస సినిమాలోని రాకాసి రాకాసి, అలానే నాన్నకు ప్రేమతో సినిమాలోని ఫాలో ఫాలో సాంగ్ లతో పాటు కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన చక్రవ్యూహ సినిమాలోని గెలియా గెలియా సాంగ్ ని కూడా ఎన్టీఆర్ ఆలపించడం జరిగింది. 

 

అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటంటే, అటు గెలియా గెలియా సాంగ్ తో పాటు తెలుగులో కూడా ఎన్టీఆర్ పాడిన పాటలన్ని కూడా ఎంతో మంచి హిట్ సాధించడం విశేషం. ఓవైపు నటుడిగా రోజురోజుకు మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తూ ముందుకు సాగుతున్న ఎన్టీఆర్, రాబోయే రోజుల్లో కూడా సాంగ్స్ పాడతారో లేదో చూడాలి. అయితే ఎక్కువమంది ఆయన ఫ్యాన్స్ మాత్రం, తమ హీరో పాటలు పాడి, సింగర్ గా కూడా మంచి పేరు దక్కించుకోవాలని కోరుతున్నారు....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: