తెలుగు చిత్ర పరిశ్రమలో గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుటుంబ బంధాలను తెలియజేయాలన్న.. ప్రేమ కథ లోని తీపిని వ్యక్తపరచాలి అన్న... జీవితంలోని బాధలను అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అన్న అది సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటల లోనే సాధ్యమవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. సిరివెన్నెల సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక గొప్ప గేయ రచయితగా  ఎంతగానో గుర్తింపు సంపాదించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలు ఎన్నో తెలుగు చిత్ర పరిశ్రమలో మైలురాయిగా నిలిచి పోయాయి. ప్రేక్షకులకు ఎప్పుడు గుర్తుండిపోయే ఎవర్గ్రీన్ సాంగ్స్ గా మారిపోయాయి. 

 

 అయితే సిరివెన్నెల సీతారామశాస్త్రి నేటి తరం దర్శకులకు సంగీత దర్శకులకు గేయ రచయితలకు ఎంతో స్ఫూర్తి అనే విషయం తెలిసిందే. ఎందుకంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలు అన్నీ ఎంతో అద్భుతమైన అర్థాన్ని కలిగి ఉంటాయి. సిరివెన్నెల పాటలలో అర్థాలను అర్థం చేసుకున్న వారికి అర్థం చేసుకున్నంత  అన్నట్టుగా ఉంటాయి పాటలు. అయితే సిరివెన్నెల సీతారామశాస్త్రిని  ఎంతగానో ఇష్టపడే దర్శకులు నేటి తరంలో చాలామంది ఉన్నారు. ఇలా నేటితరం దర్శకుల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎంతగానో ఆరాధించే దర్శకుడు త్రివిక్రమ్. మాటల మాంత్రికుడుగా  త్రివిక్రమ్ కి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు. 

 

 తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను అలరిస్తున్నారు త్రివిక్రమ్. అయితే త్రివిక్రమ్ గొప్ప గేయ రచయితగా గుర్తింపు పొందిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఎంతో గొప్పగా చెబతు ఉంటారు.  ప్రపంచం మొత్తం నిద్రపోతున్న వేళ ఆయన నిద్ర లేస్తాడు.. ఆయన ఉదయించే సూర్యుడు... ఆయన గొప్పతనం గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే.. ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి నా దగ్గర ఉన్న మాటలు సరిపోవు అనడంలో అతిశయోక్తి లేదు.... ఆయన కలం నుంచి జాలువారిన ఆణిముత్యాలు  ఎంతో మందికి స్ఫూర్తి అంటూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఎంతో గొప్పగా చెప్పుకొంటారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇలా ఎంతో మంది దర్శకులకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: